Bank – Sweeper: బ్యాంకా మజాకా..! అకౌంటే లేని వ్యక్తికి రూ.16 కోట్ల లోన్ చెల్లించాలని నోటీస్..
మున్సిపల్ ఆఫీసులో స్వీపర్‌గా పనిచేసే వ్యక్తికి 16 కోట్ల రుణం చెల్లించమంటూ బ్యాంక్ నోటీసు పంపడంతో కుటుంబం షాకయ్యింది. సకాలంలో రుణం చెల్లించకుంటే ఆస్తులను జప్తు చేస్తామని నోటీసులో హెచ్చరించారు. ఈ నోటీసు చూడగానే స్వీపర్ భార్య సొమ్మసిల్లి పడిపోయింది.
మున్సిపల్ ఆఫీసులో స్వీపర్‌గా పనిచేసే వ్యక్తికి 16 కోట్ల రుణం చెల్లించమంటూ బ్యాంక్ నోటీసు పంపడంతో కుటుంబం షాకయ్యింది. సకాలంలో రుణం చెల్లించకుంటే ఆస్తులను జప్తు చేస్తామని నోటీసులో హెచ్చరించారు. ఈ నోటీసు చూడగానే స్వీపర్ భార్య సొమ్మసిల్లి పడిపోయింది. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటుచేసుకుంది. వడోదర నగరానికి చెందిన శాంతిలాల్ మహిజిభాయ్ సోలంకి.. మున్సిపల్ ఆఫీసులో స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఏప్రిల్ 14న పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రా శాఖ నుంచి ఓ నోటీసు అందింది. 16కోట్ల 5లక్షల రుణం తీసుకున్నారని, మే 4 లోపు ఆ మొత్తాన్ని చెల్లించాలని పేర్కొన్నారు. రుణం చెల్లించనట్లయితే.. ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించడంతో శాంతిలాల్ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. ఆయన భార్య జాషిబెన్ కళ్లుతిరిగి కింద పడిపోయింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అనంతరం శాంతిలాల్.. వడోదరలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు కార్యాలయానికి వెళ్లి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ఆ కుటుంబం మొత్తం ఆస్తులే 10 లక్షలలోపు ఉంటాయని, అలాంటిది 16 కోట్లు అప్పు ఎలా చేస్తారని అధికారులపై మండిపడుతున్నారు. అసలు తనకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో అకౌంట్ లేదని, ఇప్పటివరకు ఎటువంటి రుణం తీసుకోలేదని వాపోయాడు శాంతిలాల్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!