Crime: ఎయిర్‌పోర్ట్‌లో తేడాగా కనిపించిన వ్యక్తి.. తడబడుతూ నడిచాడు.. దొరికిపోయాడు.
ఎప్పటిలానే ఆ రోజు కూడా కస్టమ్స్ అధికారులు, పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లో సాధారణ తనిఖీలు చేపట్టారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ఫ్లైట్ అప్పుడే ల్యాండ్ అయింది. ప్రయాణీకులు ఒక్కొక్కరిగా ఎగ్జిట్ నుంచి లోపలికి వస్తున్నారు.
ఎప్పటిలానే ఆ రోజు కూడా కస్టమ్స్ అధికారులు, పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లో సాధారణ తనిఖీలు చేపట్టారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ఫ్లైట్ అప్పుడే ల్యాండ్ అయింది. ప్రయాణీకులు ఒక్కొక్కరిగా ఎగ్జిట్ నుంచి లోపలికి వస్తున్నారు. ఇంతలో అధికారులకు ఓ వ్యక్తి కదలికలపై అనుమానమొచ్చింది. అతడ్ని తనిఖీ చేసిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. చెన్నై విమానశ్రయంలో దిగిన ఆ వ్యక్తి నడక చూసి అనుమానించిన పోలీసులు అతన్ని పక్కకు తీసుకెళ్లి చెక్ చేశారు. చివరికి అతని బట్టలు విప్పించారు. అతని రెండు కాళ్లకు బ్యాండేజ్‌లు ఉన్నాయి. వాటని ఓపెన్ చేసి చూడగా 1128 గ్రామలు బంగారం బయటపడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఆ వ్యక్తి బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్ అధికారులు . అతడి దగ్గర నుంచి 70 లక్షలు విలువైన 24 కారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
వాష్‌రూమ్‌లో ఊహించని సీన్.. దెబ్బకు కళ్లు బైర్లు
మతిమరుపుతో తప్పిపోయిన వ్యక్తి.. కుటుంబంతో కలిపిన చాట్‌జీపీటీ
స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు..

