డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు?

Updated on: Dec 05, 2025 | 11:53 AM

నోస్ట్రడామస్ అంచనాలు భారత దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా గతంలో నిజమైనవి. 2025లో భూమికి గ్రహశకలం ఢీకొట్టడం, బ్రిటన్‌లో ప్లేగు వంటి వ్యాధి, ఖండాంతర యుద్ధం ముగింపు వంటివి జరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు. చైనా, పాకిస్తాన్ కలిసి భారతదేశంపై దాడి చేయవచ్చని కూడా ఊహించారు. 2025 సమీపిస్తున్న వేళ, ఈ అంచనాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఈ ఏడాది మరి కొన్ని రోజుల్లో ముగియబోతోంది. ప్రముఖ ఫ్రెంచ్‌ తత్వవేత్త నోస్ట్రడామస్‌ … భారతతోపాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక అంశాల గురించి ముందే అంచనా వేశారు. బాబా వంగాతో పాటు ప్రముఖ ఫ్రెంచ్ తత్వవేత్త, జ్యోతిషుడు నోస్ట్రడామస్ అంచనాలు కూడా చాలా వరకు నిజమయ్యాయి. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల గురించి నోస్ట్రడమస్ అంచనాలు వేశాడు. భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి 945 సంపుటిలతో కూడిన విశ్లేషణలను 1555లో విడుదల చేశారు. ఈ అంచనాల ప్రకారం..అణు దాడులు, సెప్టెంబర్ 11 ఉగ్ర దాడులు, యువరాణి డయానా, హిట్లర్, రాజీవ్ గాంధీకి సంబంధించి, కోవిడ్‌-19 వంటి అనేక ఇతర సంఘటనలను ఆయన అంచనా వేశారంటారు. నోస్ట్రాడమస్ అంచనాలన్నీ చాలా ఖచ్చితమైనవిగా నిరూపణ అయ్యాయంటారు. ఈ క్రమంలోనే ఆయన అంచనాల్లో ఒక భయానకమైన విషయం వెలుగులోకి వచ్చింది. మన పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్ సంయుక్తంగా భారతదేశంపై దాడి చేయవచ్చని జోస్యం చెప్పారు. భారతదేశం, పాకిస్తాన్ లేదా చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా ఈ జోస్యం తిరిగి ప్రచారంలోకి వస్తుంది. ఇది ఎలా వెలుగులోకి వచ్చిందో తెలుసుకుందాం. 1500 శతాబ్దంలో ఫ్రాన్స్ లో జన్మించిన నోస్ట్రడామస్ జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ అధికారంలోకి రావడం,అమెరికాలో సెప్టెంబర్ 11 దాడులు, కొవిడ్‌-19 మహమ్మారి.. ప్రపంచాన్ని అతలాకుతలం చేయడం వంటి పరిణామాలను అంచనావేసి చెప్పారు. అతను 1555లో ప్రచురించిన తన పుస్తకం లెస్ ప్రోఫేటిస్ ద్వారా అంతర్జాతీయంగా కాలజ్ఞానిగా ప్రసిద్ధి చెందాడు. ఆ పుస్తకంలో దాదాపుగా 942 అంశాల గురించి తెలిపారు. భారతదేశం శక్తివంతమైన దేశంగా మారే సామర్థ్యాన్ని నోస్ట్రాడమస్ కూడా గుర్తించాడు. 2025లో భూగోళాన్ని ఓ గ్రహశకలం ఢీకొంటుందని, దీని వల్ల భూమి మీద పెను మార్పులు సంభవిస్తాయని తెలిపాడు. బ్రిటన్‌లో ప్లేగు వంటి ఓ మహమ్మారి కారణంగా వ్యాధి ప్రబలుతుందని, పెద్ద సంఖ్యలో జనం మరణిస్తారని సూచించాడు. ఓ ఖండాంతర యుద్ధం 2025లో ముగుస్తుందని తెలిపాడు. సుదీర్ఘ యుద్ధంలో ఇరుదేశాల సైన్యం అంతా అలసిపోతుందని, ఆర్థికంగా ఇరుదేశాలు ఇబ్బందికర పరిస్థితికి చేరుకుంటాయి. కాబట్టి పేదరికానికి ఆహ్వానం పలుకుతూ యుద్ధాన్ని ముగిస్తారని తలిపారు. సో.. 2014లో మొదలై.. 2022లో పూర్తిస్థాయి యుద్ధంగా మారిన రష్యా-ఉక్రెయిన్ మధ్య వార్ ఆగిపోతుందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ యుద్ధంలో ఫ్రాన్స్, టర్కీ కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ దేశం అటు యుద్ధాలు,ఇటు ప్లేగు వంటి వ్యాధులను ఎదుర్కొంటుంది. మరికొన్ని రోజుల్లో 2025 ముగియబోతున్న నేపథ్యంలో నోస్ట్రడామస్‌ జ్యోతిష్యం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక్‌

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్.. కన్ను పడిందా