Kim Vs South Korea: కిమ్ చెత్త బెలూన్లకు లౌడ్ స్పీకర్లతో రివెంజ్.. కిమ్ మామూలోడు కాదు.
వందలాదిగా చెత్తతో నింపిన బెలూన్లను పంపుతూ కవ్విస్తున్న ఉత్తర కొరియాకు దక్షిణ కొరియా గట్టి జవాబిస్తోంది. సరిహద్దుల్లో పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసి ఉత్తర కొరియా వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించింది. సైనిక స్థావరాలు ఉన్న ఉత్తర కొరియా ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా K-పాప్ సంగీతం, విదేశీ వార్తలతో పాటు, ప్యాంగ్యాంగ్ వ్యతిరేక ప్రసారాలను దక్షిణ కొరియా సైన్యం హోరెత్తిస్తోంది.
వందలాదిగా చెత్తతో నింపిన బెలూన్లను పంపుతూ కవ్విస్తున్న ఉత్తర కొరియాకు దక్షిణ కొరియా గట్టి జవాబిస్తోంది. సరిహద్దుల్లో పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసి ఉత్తర కొరియా వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించింది. సైనిక స్థావరాలు ఉన్న ఉత్తర కొరియా ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా K-పాప్ సంగీతం, విదేశీ వార్తలతో పాటు, ప్యాంగ్యాంగ్ వ్యతిరేక ప్రసారాలను దక్షిణ కొరియా సైన్యం హోరెత్తిస్తోంది. క్షిపణులు, శతఘ్నులతో పరస్పరం కవ్వించుకునే రెండు కొరియా దేశాలు కొత్త దారులు వెదుక్కుంటున్నాయి. ఇన్ని రోజులు చెత్త, విసర్జన పదార్థాలు నిండిన భారీ బెలూన్లను దక్షిణ కొరియాకు పంపి ఉత్తర కొరియా కవ్వించగా, ఇప్పుడు సియోల్ ప్రతీకార చర్యలకు దిగింది. పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లను సరిహద్దుల వద్ద మోహరించి వ్యతిరేక ప్రచారం చేస్తోంది.
ఉత్తర కొరియాలో విదేశీ వార్తలు, కె-పాప్ సంగీతాన్ని తీవ్ర నేరాలుగా పరిగణిస్తారు. అవి తమ పౌర సమాజంలో ప్రభుత్వ వ్యతిరేక భావాలను నాటుతుందని, తన అధికారాన్ని బలహీనపరుస్తుందని నియంత కిమ్ జోంగ్ ఉన్ భావిస్తారు. 2015లో ఇలాగే దక్షిణ కొరియా లౌడ్ స్పీకర్లతో ఉత్తర కొరియా వ్యతిరేక ప్రచారం చేయగా ప్రతిచర్యగా కిమ్ ప్రభుత్వం ఫిరంగులను పేల్చింది. అప్పట్లో అది ఉద్రిక్త పరిస్థితులకు తావిచ్చింది. మళ్లీ ఆ పరిస్థితులే ఎదురైతే ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని దక్షిణ కొరియా రక్షణ మంత్రి సైనిక బలగాలను ఆదేశించారు. లౌడ్ స్పీకర్ల వ్యవహారంపై ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ తీవ్రంగా స్పందించారు. ఇది చాలా ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఈ చర్యలకు తక్షణమే అడ్డుకట్ట వేయకపోతే గతంలో చూడని విధంగా స్పందిస్తామని ప్రకటించారు. ఇటీవల అమెరికాతో కలిసి సియోల్ సైనిక విన్యాసాలు నిర్వహించడం, తమ భూభాగంలో కరపత్రాలను జారవిడవడానికి వ్యతిరేకంగా ఉత్తర కొరియా చర్యలు చేపట్టింది. దక్షిణ కొరియావైపు చెత్తతో నిండిన బెలూన్లను పంపించింది. మొత్తం వెయ్యికిపైగా బెలూన్లు వచ్చి రహదారులపై ఎక్కడికక్కడ పడ్డాయి. అందులోని బ్యాగుల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాటరీలు, పాడైన షూలు, కాగితాలు, జంతు విసర్జితాలను నింపారు. ఇందుకు ప్రతిస్పందనగా సియోల్ లౌడ్ స్పీకర్ల వ్యూహాన్ని ఎంచుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.