కైలాసలో నిత్యానంద భూ దందా.. 20 మంది శిష్యులపై బహిష్కరణ వీడియో

Updated on: Apr 06, 2025 | 4:47 PM

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న దొంగ స్వామి నిత్యానందకు మరో షాక్ తగలింది. బొలీవియాలోని ఇమ్మిగ్రేషన్ శాఖ నిత్యానంద స్థాపించిన కల్పిత దేశం కైలాస నుండి 20 మంది పౌరులను బహిష్కరించినట్లు ప్రకటించింది. బొలీవియాలోని గిరిజనులకు చెందిన భూమిని స్వాధీనం చేసుకోవడానికి 20 మంది ప్రయత్నించారని ఆ దేశం తెలిపింది.

నిత్యానంద అనుచరులు పర్యాటకులుగా బొలీవియాలోకి ప్రవేశించారని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ డైరెక్టర్ కేథరీన్ కాల్డెరాన్ చెప్పారు. భారత్‌లో చేయకూడని పనులన్నీ చేసి కైలాసకు చెక్కేసిన నిత్యానంద.. ఏకంగా సొంత దేశాన్నే ఏర్పాటు చేసినట్టు ప్రకటించుకున్నారు. తమ దేశానికి సొంత కరెన్సీ, సొంత పౌరసత్వం, సొంత ప్రభుత్వం ఉన్నాయంటూ వెబ్‌సైట్‌లో ప్రచారం చేసుకున్నాడు. కానీ ఆ దేశం వరల్డ్‌ మ్యాప్‌లో కాదు కదా.. గూగుల్‌ మ్యాప్‌లో కూడా కనిపించదు. కైలాస దేశానికి ఎక్స్‌టెన్షన్‌ అంటూ మొదలుపెట్టి దక్షిణ అమెరికాలోని బొలీవియాను టార్గెట్‌ చేశారు. తన శిష్యులతో కలిసి అక్కడి గిరిజనుల నుండి అతి చౌకగా లక్షల ఎకరాలు భూములు కొట్టేయడానికి ప్లాన్‌ వేశారు. భూములతో పాటు అక్కడి వనరులపై తనకే సర్వహక్కులు దక్కేలా ఒప్పందంలో షరతులు విధించారు నిత్యానంద.