గంటకు 10 కి.మీ వేగం.. జీవితంలో ఒక్కసారైనా ఎక్కాల్సిన రైలు

Updated on: Jan 05, 2026 | 7:48 PM

మెట్టుపాలయం-ఊటీ నీలగిరి ప్యాసింజర్ రైలు ప్రపంచంలోనే నెమ్మదైన ప్రయాణాలలో ఒకటి. గంటకు 10 కి.మీ వేగంతో సాగే ఈ రైలు, నీలగిరి పర్వతాల గుండా అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని చూపుతుంది. 2005లో UNESCO వారసత్వ జాబితాలో చేరిన ఈ రైలు ప్రయాణం, పచ్చని అడవులు, టీ తోటలు, జలపాతాలను వీక్షించేందుకు పర్యాటకులకు అనువైన మార్గం. IRCTC ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

మీరు ఎప్పైడైనా ఊటీ వెళ్లారా? వెళితే మాత్రం మెట్టుపాలయం–ఊటీ నీలగిరి ప్యాసింజర్ రైలు ఎక్కడం మాత్రం మిస్‌ కావొద్దు. ఎందుకంటే ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే రైళ్లలో ఒకటి. గంటకు కేవలం 10 కి.మీ వేగంతో నడుస్తుంది. దేశ, వీదేశీ పర్యాటకులు ఈ రైలు ప్రయాణం చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తుంటారు. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఈ రైలు ప్రయాణాన్ని ఒకసారి అనుభవించాలని ఊటీకి వస్తారు. ఈ రైలు తమిళనాడులోని మెట్టుపాలయం నుంచి ఊటీ వరకు 46 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఈ చిన్న దూరాన్ని పూర్తి చేయడానికి దాదాపు 5 గంటల సమయం పడుతుంది. ప్రతి రోజు ఉదయం 7:10 గంటలకు మెట్టుపాలయం నుంచి బయలుదేరి, మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఊటీ చేరుతుంది. తిరుగు ప్రయాణం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 5:30 వరకు మెట్టుపాలయానికి చేరుకుంటుంది. టికెట్లు IRCTC వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఈ రైలు నీలగిరి పర్వత ప్రాంతాల గుండా వెళుతుంది. మొత్తం ట్రాక్‌లో 16 సొరంగాలు, 250 వంతెనలు, 200కుపైగా క్రాసింగ్స్‌ను దాటుకుంటూ నెమ్మదిగా నడుస్తుంది. నీలగిరి కొండల మధ్యన వెళ్లే ఈ రైలు చెక్క బోగీలలో కూర్చుని కిటికీ బయట చూస్తే పచ్చని అడవులు, టీ తోటలు, జలపాతాలు, లోయల అందాలు కనువిందు చేస్తాయి. రైలు నెమ్మదిగా నడవడం వల్ల ఈ సహజ సౌందర్యాన్ని ప్రశాంతంగా ఆస్వాదించగలుగుతారు. నీలగిరి మౌంటెన్ రైల్వే 2005లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు ద‌క్కించుకుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

2026 భయానకం.. నోస్ట్రడామస్ జోస్యం

బీచ్‌లో చిరుతపులి మచ్చల చేప.. దగ్గరకు వెళ్లి చూడగా

ఆ ఊళ్లో సహజీవనం చేస్తే భారీ జరిమానా

ఇదేం చేపరా సామీ.. నెత్తిమీద గ్రిల్స్‌తో

ఈ ‘చిట్టి’ పక్షులు !! 6,000 కి.మీ వలస వెళ్లాయంటే నమ్ముతారా