అయ్యబాబోయ్‌.. రూ.6 లక్షల బిర్యానీలు హాంఫట్‌

Updated on: Jan 03, 2026 | 11:24 AM

కొత్త ఏడాది వేడుకలలో భాగంగా బాపట్ల జిల్లా ప్రజలు భారీగా బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు. కేవలం 24 గంటల్లోనే 6 కోట్ల రూపాయల విలువైన బిర్యానీని ఆరగించి రికార్డు సృష్టించారు. జిల్లా జనాభాలో సుమారు 6 లక్షల మంది బిర్యానీని ఆస్వాదించారు. ఆన్‌లైన్ ఆర్డర్లు, ఇతర ఆహారాలతో ఈ సంబరాలు మరింత ఘనంగా జరిగాయి, దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగింది.

కొత్త ఏడాది వస్తుందంటే ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తారు. పాత ఏడాదికి వీడ్కోలు చెబుతూ..న్యూ ఇయర్‌కు స్వాగతం చెబుతూ గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఈ క్రమంలో కేకులు కట్‌చేస్తూ, బిర్యానీలు ఆరగిస్తూ.. కూల్‌ డ్రింక్స్‌, మద్యం సేవిస్తూ రకరకాలుగా సెలబ్రేట్‌ చేసుకుంటారు. ప్రస్తుత కాలంలో అన్నీ ఆన్‌లైనే కదా… ఇక ఆన్‌లైన్‌లో తమకు ఇష్టమైన ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకుని అందరూ హ్యాపీగా ఎంజాయ్‌ చేశారు. అయితే ఒక్క జిల్లాలో మాత్రం 24 గంటల వ్యవధిలో ఏకంగా 6 కోట్ల విలువైన బిర్యానీలు ఆరగించారు. కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ బుధవారం రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందినవారు ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. ప్రధానంగా యువత, ఉద్యోగులు, ప్రజలు కేకులు, బిర్యానీలతో సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక్క బాపట్ల జిల్లాలోనే రూ. 6 కోట్ల విలువైన బిర్యానీలు ఆరగించారు. ఈ జిల్లాలో 12.75 లక్షల మంది జనాభా ఉన్నారు. ప్రతి ఇద్దరిలో ఒకరు.. అంటే సమారుగా 6 లక్షల మంది వరకు కొత్త ఏడాది రోజున సంతోషంగా బిర్యానీ లాగించేశారు. ఒక్కొక్క బిర్యానీ విలువ సరాసరి రూ.100 అనుకున్నా ఏకంగా రూ.6 కోట్లను ఒక్క బిర్యానీ కోసమే ఖర్చుచేశారు. ఇక మిగిలిన వాటి వ్యయం అదనం అనుకోండి. అలా ఒక్క జిల్లాలోనే 6 కోట్ల బిర్యానీలో లాగించేస్తే ఇక దేశవ్యాప్తంగా ఎన్ని వందల కోట్లు బిర్యానీలు ఆరగించారో..!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎంతకు తెగించావురా !! రీల్స్‌ కోసం ఇంత రిస్క్‌

ఇంటిలోకి ప్రవేశించిన చిరుత.. సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌

కోహ్లీ, రోహిత్‌ గురించి పఠాన్‌ అంత మాటనేశాడేంటి ??

శ్రీశైలంలో చిరుత హల్చల్‌.. పూజారి ఇంటి ఆవరణలో

‘ఆమె నా కూతురు’ అంటూ.. షాకిచ్చిన టబు