New Traffic Fines: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డారో.. మీ ఒంట్లో రక్తం ఉండదు జాగ్రత్త… ఎక్కడో తెలుసా..?

|

Jul 21, 2022 | 8:39 AM

పంజాబ్ ప్రభుత్వం శుక్రవారం నోటిఫై చేసిన కొత్త ట్రాఫిక్ రూల్స్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. కొత్త నిబంధనల ప్రకారం, పంజాబ్‌లో వాహనాదారులు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే రక్తదానం చేయాలి..


పంజాబ్ ప్రభుత్వం శుక్రవారం నోటిఫై చేసిన కొత్త ట్రాఫిక్ రూల్స్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. కొత్త నిబంధనల ప్రకారం, పంజాబ్‌లో వాహనాదారులు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే రక్తదానం చేయాలి లేదంటే సమీపంలోని ఆసుపత్రిలో సమాజ సేవ చేయాలి. అంతేకాదు.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారు రవాణా శాఖ నిర్దేశించిన రిఫ్రెషర్ కోర్సు సర్టిఫికేట్ కూడా పొందవలసి ఉంటుంది. అలాగే ట్రాఫిక్ నిబంధనలపై 20 మంది పిల్లలకు రెండు గంటల పాటు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అలాగే సమీపంలోని ఓ ఆసుపత్రిలో కనీసం 2 గంటల పాటు సామాజిక సేవ చేయాలి లేదంటే ఒక యూనిట్‌ రక్తం దానం చేయాలి. అతి వేగంతో ప్రయాణించినా కూడా ఫైన్స్ భారీగా ఉన్నాయి. పరిమితికి మించిన వేగంతో డ్రైవింగ్‌ చేస్తూ ఫస్ట్ టైమ్ పట్టుబడితే 1000 రూపాయలు, రెండోసారి దొరికితే 2,000 చొప్పున ఫైన్ విధిస్తారు. మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. అదే మద్యం లేదా డ్రగ్స్ మత్తులో బండి నడుపుతూ దొరికితే ఫస్ట్ టైమ్ 5,000.. తర్వాత 10,000 రూపాయల ఫైన్‌తో పాటు మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Published on: Jul 21, 2022 08:39 AM