మధ్యప్రదేశ్‌ను వణికిస్తున్న కొత్త వైరస్ వీడియో
మధ్యప్రదేశ్‌లో టమాటా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఆరు నెలల నుంచి 12 ఏళ్ల లోపు చిన్నారులను లక్ష్యంగా చేసుకుని ఈ వైరస్ విజృంభిస్తోంది. చేతులు, పాదాలు, నోటిలో ఎర్రటి దద్దుర్లు, బొబ్బలు దీని ప్రధాన లక్షణాలు. దీనికి ప్రత్యేక చికిత్స లేనప్పటికీ, పరిశుభ్రత పాటించడం ద్వారా నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో టమాటా వైరస్ పేరుతో ఓ కొత్త వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఆరు నెలల నుంచి 12 ఏళ్ల లోపు చిన్నారులను లక్ష్యంగా చేసుకుని ఈ వైరస్ విజృంభిస్తోంది. భోపాల్ నగరంలోని పాఠశాలల్లో ఈ వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో వైరస్‌లు విజృంభించడానికి అనువైన కాలం కావడంతో ఆందోళన నెలకొంది.ఈ వైరస్ సోకిన చిన్నారులకు చేతులు, పాదాలు, అరికాలు, మెడ కింద, నోటిలో ఎర్రటి దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. వైరస్ సోకిన మూడు నుంచి ఆరు రోజుల్లో దురద, మంట, గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
