విడాకులిచ్చిన భార్యకు షాక్.. భర్తకు జాక్‌పాట్‌.. ఏం జరిగిందట వీడియో

Updated on: Sep 01, 2025 | 6:20 PM

ఇటీవల కాలంలో వివాహ బంధాలకు విలువ లేకుండా పోతుంది. చిన్న చిన్న కారణాలకే కొంతమంది విడాకుల వరకు వెళుతున్నారు. ఆర్థిక సమస్యలు, మనస్పర్థలతో కలిసి జీవించలేకపోతున్నారు. అలా పెళ్లయిన దగ్గరనుంచి కనీసం అవసరాలు కూడా తీర్చడం లేదని భర్తతో గొడవపడి వదిలి వెళ్ళిపోయింది ఓ భార్య. కట్ చేస్తే కొన్ని రోజుల్లోనే అతను కోటీశ్వరుడయ్యాడు. ఈ ఘటన అమెరికాలో జరిగింది.

అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో తెలియదు. కటిక దరిద్రుడిని రాత్రికీ రాత్రే కోటీశ్వరుడిని చేస్తుంది. అమెరికా న్యూ జెర్సీకి చెందిన మైక్ వీన్ కి ఈ విషయంలోనే అదే జరిగింది. 15 ఏళ్ళ క్రితం పెళ్ళయిన మైక్ సరైన ఉద్యోగం లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రతిరోజూ భార్య అతనితో గొడవపడేది. కనీసం అవసరాలు కూడా తీర్చడం లేదని తనను ఎప్పుడూ బయటికి కూడా తీసుకు వెళ్ళడం లేదని గొడవపడేది. చివరికి విసిగిపోయిన ఆమె నీతో కలిసి జీవించలేనని విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. తన పరిస్థితిని తలచుకొని నిస్సహాయంగా ఉండిపోయిన మైక్ ని కొన్ని రోజులకే అదృష్టం తలుపు తట్టింది. లాటరీ రూపంలో ధనలక్ష్మీ హక్కున చేర్చుకుంది. లక్ష, రెండు లక్షలు కాదు ఏకంగా 2,280 కోట్ల లాటరీ తగిలింది. ఈ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భార్య వదిలి వెళ్ళిపోయిన తర్వాత మైక్ జీవితం ఊహించని మలుపు తిరిగింది. మైక్ కి లాటరీ టికెట్లు కొనడం అలవాటు. ఎప్పటికైనా తనను అదృష్టం వరించకపోతుందా అని తరుచు లాటరీ టికెట్లు కొంటూ ఉంటాడు. అతని ఆశ నెరవేరింది. తాను కొన్న ఓ లాటరీ టికెట్ 273 మిలియన్ డాలర్ల జాక్ పాట్ తగిలింది. అంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాల 2,280 కోట్లు. దీంతో దెబ్బకు దశ తిరిగింది. అతని పేదరికం వదిలిపోయింది. ఈ ఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. నెటిజన్లు దీనిపై ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. మైక్ డబుల్ జాక్ పాట్ కొట్టాడని కొందరు ఇప్పుడు నీ భార్య నీ దగ్గరకు తప్పక తిరిగి వస్తుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం :

మీ పిల్లలకు ఆట బొమ్మలు ఇస్తున్నారా?అయితే తస్మాత్‌ జాగ్రత్త!

ఎయిర్‌షోలో షాక్‌..అగ్నిగోళంగా యుద్ధ విమానం.. ఫైలెట్ మృతి!

మోసపోయి.. పిచ్చివాడిలా మారి.. భిక్షాటన చేస్తూ 13 ఏళ్లకు వీడియో

దారిచ్చే సముద్రం చూసారా? ఏటా రెండుసార్లు.. ఎక్కడంటే వీడియో