Human Extinction: పది లక్షల సంవత్సరాల క్రితం అంతరించే దశకు మానవజాతి..
ప్రస్తుతం 800 కోట్లు దాటిన ప్రపంచ జనాభా ఒకప్పుడు అంతరించిపోయే దశకు చేరుకుందని మీకు తెలుసా? అవును తాజాగా జరిపిన ఓ పరిశోధనలో శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన విషయాలను కనుగొన్నారు. ఈ పరిశోధనలో దాదాపు 10 లక్షల సంవత్సరాల క్రితం మానవజాతి దాదాపు అంతరించే దశకు చేరుకుందన్న విషయం వెలుగుచూసింది. అప్పుడు కేవలం 1,280 మంది మాత్రమే మిగిలారని అధ్యయనం వెల్లడించింది.
ప్రస్తుతం 800 కోట్లు దాటిన ప్రపంచ జనాభా ఒకప్పుడు అంతరించిపోయే దశకు చేరుకుందని మీకు తెలుసా? అవును తాజాగా జరిపిన ఓ పరిశోధనలో శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన విషయాలను కనుగొన్నారు. ఈ పరిశోధనలో దాదాపు 10 లక్షల సంవత్సరాల క్రితం మానవజాతి దాదాపు అంతరించే దశకు చేరుకుందన్న విషయం వెలుగుచూసింది. అప్పుడు కేవలం 1,280 మంది మాత్రమే మిగిలారని అధ్యయనం వెల్లడించింది. అప్పట్లో ఎదురైన తీవ్రమైన ఇబ్బందులు మానవజాతి మనుగడను ప్రశ్నార్థకం చేశాయని పరిశోధకులు పేర్కొన్నారు. అలా మిగిలిన వారి ద్వారా మళ్లీ జాతి నిలకడగా వృద్ధి చెందిందని వివరించారు. మొత్తం 3,154 మంది ఆధునిక మానవుల జన్యుక్రమంపై శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఫిట్‌కోల్ అనే పద్ధతి ఆధారంగా ఆఫ్రికా, యూరేషియాలోని వేల ఏళ్ల క్రితం నాటి శిలాజాలను విశ్లేషించారు. ఆధునిక మానవుడిలో కనిపిస్తున్న 65.85 శాతం జన్యు వైవిధ్యం లక్షల సంవత్సరాల క్రితం నాటి మానవుల్లో లేదని, దీనర్థం అప్పట్లో మానవజాతి అంతరించే దశకు చేరుకోవడమే కారణమని వివరించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..