నా జీతం రూ. 18,500 మాత్రమే… ఓ తల్లి ఆవేదన

|

Oct 21, 2023 | 10:09 AM

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే విభిన్న కథలు మనకు కొత్త అనుభూతులను పంచుతాయి. గరిమా సోల్ అనే రెడ్డిట్ యూజర్ తాజాగా షేర్ చేసిన ఓ కథనం నెటిజన్లను భావోద్వేగానికి గురి చేస్తోంది. ఈ స్పూర్తిదాయక కథనం చాలా మంది దృష్టిని ఆకర్షించింది. సింగిల్ మదర్ అయిన గరిమా చాలా తక్కువ సంపాదనతో ఢిల్లీలో నివసిస్తోంది. సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్‌లో నివసిస్తున్న గరిమా నెలకు రూ.5.5 వేలు అద్దె చెల్లిస్తోంది. ఆమె నాలుగేళ్ల కొడుకు ఆటిజంతో బాధపడుతున్నాడు.

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే విభిన్న కథలు మనకు కొత్త అనుభూతులను పంచుతాయి. గరిమా సోల్ అనే రెడ్డిట్ యూజర్ తాజాగా షేర్ చేసిన ఓ కథనం నెటిజన్లను భావోద్వేగానికి గురి చేస్తోంది. ఈ స్పూర్తిదాయక కథనం చాలా మంది దృష్టిని ఆకర్షించింది. సింగిల్ మదర్ అయిన గరిమా చాలా తక్కువ సంపాదనతో ఢిల్లీలో నివసిస్తోంది. సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్‌లో నివసిస్తున్న గరిమా నెలకు రూ.5.5 వేలు అద్దె చెల్లిస్తోంది. ఆమె నాలుగేళ్ల కొడుకు ఆటిజంతో బాధపడుతున్నాడు. అతను మాట్లాడలేడు. అతనికి చికిత్స కాదు కదా.. పండ్లు కూడా కొనలేకపోతున్నానని పౌష్టికాహారం కోసం బాబును అంగన్‌వాడీలకు పంపుతుంటానని గరిమా చెప్పుకొచ్చింది. తన నెలవారీ సంపాదన రూ.18,500 మాత్రమే అని నెల చివరికి వచ్చే సరికి చేతిలో రూపాయి కూడా మిగలదని తెలిపింది. చాలా మంది అద్దె కోసమే రూ.50 వేలు చెల్లిస్తుంటారనీ తనకు అంత సంపాదన ఉంటే తన కొడుకు పరిస్థితి ఎలా బాగు చేయాలా అని ఆలోచిస్తుంటా అని గరిమా చెప్పింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫుట్‌పాత్‌‌పై నడిచినా ప్రాణాలకు గ్యారెంటీ లేదా ??

కారులో వెళ్లి.. కాల్వలో తేలాడు !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

రైలు ప్యాంట్రీ కార్లో ఫుడ్డా.. ఎలుకలుంటాయ్ జాగ్రత్త !!

70ఏళ్ల చరిత్రలో సరికొత్త అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో చరిత్రలో తొలిసారి