తండ్రి వెనుక కూర్చోగా స్కూటర్ నడుపుతున్న బాలిక !! మండిపడుతున్న నెటిజన్లు

|

Oct 29, 2024 | 9:28 PM

పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటే తల్లిదండ్రులు మురిసిపోవడం, వారిని మరింత ప్రోత్సహించడం సహజం. కానీ ఇక్కడ ఓ తండ్రి చేసిన నిర్వాకం అందరినీ అసహనానికి గురి చేస్తోంది. ఇతను అసలు తండ్రేనా? కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లేదా అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే.. తన కుమార్తెను స్కూలుకు తీసుకెళ్తున్నాడు.

ఇందులో మండిపడాల్సిందేముంది అనుకుంటున్నారా? ఉంది.. స్కూటర్ నడిపేది తండ్రి కాదు.. పదేళ్లుకూడా నిండని అతని కుమార్తె. ఇప్పుడు కొప్పడొచ్చు కదా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ తండ్రి తీరుకు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవింగ్‌కు నిర్దిష్ట స్థాయి అనేది ఉంటుంది. అందుకే ప్రతి దేశానికి కనీస వయస్సు ఉంటుంది. ఇది డ్రైవర్లు వాహనాన్ని సురక్షితంగా ఆపరేట్ చేయగల దశకు చేరుకున్నారని నిర్ధారించుకోవడానికి సహాయపడుతుంది. మనం రోడ్ల మీద పిల్లలు బైక్‌లు లేదా కార్లు నడుపుతున్న సందర్భాలు చూస్తూ ఉంటాం.. కానీ చిన్న అమ్మాయి తన తండ్రిని స్కూటర్‌పై కూర్చోబెట్టుకుని స్కూటర్‌ను నడుపుతూ స్కూలుకి వెళ్లడం ఇప్పుడు జనాలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అక్కోయ్.. ఫస్ట్ శాలరీనా పిచ్చ హ్యాపీగా ఉన్నట్టున్నావుగా

డేజంర్‌ బెల్స్ మోగిస్తున్న డ్రై ఐ సిండ్రోమ్

ఓర్నీ.. అరచేతిని స్కాన్ చేసి పేమెంట్ !! చైనాలో కొత్త టెక్నాలజీ !!

తెలంగాణలో ఈసారి శీతాకాలం.. వణికిస్తుందా ?? ఉక్కపోస్తుందా ??

అమెరికాలో 170 ఏళ్లుగా మంగళవారమే.. ఎందుకు ఎన్నికలు జరుపుతున్నారు ??

Follow us on