No entry for sari wearers: అక్కడ చీర కట్టుకున్నవారికి నో ఎంట్రీ..! రూల్స్ ఒప్పుకోవంటూ వాదించిన మేనేజర్(వీడియో)

|

Sep 25, 2021 | 6:01 PM

కుమార్తె పుట్టినరోజును ఘనంగా జరుపుకోవాలని అనుకుంది ఓ మాజీ జర్నలిస్టు. ఇంటికి దగ్గరలోనే ఉన్న ఓ రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేసింది. ఏర్పాట్లన్నీ చేసుకుని రెస్టారెంట్‌కు వెళ్లింది. తీరా అక్కడకు వెళ్లాక కుమార్తెను లోపలకు అనుమతించిన సిబ్బంది ఆమెను మాత్రం ఆపేశారు. అదేంటని ప్రశ్నిస్తే ఆమె చీర కట్టుకొని ఉందని...

కుమార్తె పుట్టినరోజును ఘనంగా జరుపుకోవాలని అనుకుంది ఓ మాజీ జర్నలిస్టు. ఇంటికి దగ్గరలోనే ఉన్న ఓ రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేసింది. ఏర్పాట్లన్నీ చేసుకుని రెస్టారెంట్‌కు వెళ్లింది. తీరా అక్కడకు వెళ్లాక కుమార్తెను లోపలకు అనుమతించిన సిబ్బంది ఆమెను మాత్రం ఆపేశారు. అదేంటని ప్రశ్నిస్తే ఆమె చీర కట్టుకొని ఉందని, రెస్టారెంట్లోకి కేవలం స్మార్ట్ క్యాజువల్స్ వేసుకున్న వారికే అనుమతి ఉందని చెప్పారు.

తన చీర కూడా క్యాజువల్ డ్రస్సే కదా అని ఆమె వివరించినా వాళ్లు ఒప్పుకోలేదు. చివరకు రెస్టారెంట్ మేనేజర్ కూడా వచ్చి ఆమెనే తప్పుబట్టాడు. ఆమె ఎవరో కాదు.. మాజీ జర్నలిస్టు అనితా చౌధరి. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఖేల్ గావ్‌లో ఉన్న ఆక్విలా అనే రెస్టారెంట్ వద్ద ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది. అనిత, ఆమె కుమార్తె ఎంత వివరించినా ఆ రెస్టారెంటు సిబ్బంది మాత్రం ఆమెను లోపలకు అనుమతించడానికి ససేమిరా అన్నారు. దీంతో బుక్ చేసిన టేబుల్ క్యాన్సిల్‌ చేసి తిరిగి వెళ్ళిపోయారు. ఈ మొత్తం వివాదాన్ని వీడియో తీసిన ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. చీర స్మార్ట్ క్యాజువల్ కాదని తనను రెస్టారెంట్లోకి అనుమతించలేదని, దీని వల్ల తన కుమార్తె పుట్టినరోజు ప్రోగ్రాం చెడిపోయిందని అనిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రెస్టారెంటుతీరుపై మండిపడుతున్నారు. అనిత షేర్ చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని చదవండి ఇక్కడ : Tips To Reduce Uneasiness Video: ఇష్టమైన ఫుడ్ ఓ ముద్ద ఎక్కువే లాగించారా? పొట్ట ఉబ్బరానికి ఇలా చెక్ పెట్టండి..!(వీడియో)

 Woman behind DRDO leaks: డీఆర్‌డీఓ సీక్రెట్స్ లీక్‌లో మహిళ హస్తం..! విచారణలో బయటపడుతున్న కొత్త విషయాలు..(వీడియో)

 Australia Earthquake Video: మంచులో స్కేటింగ్‌ చేస్తుండగా భూకంపం.. వైరల్ అవుతున్న వీడియో..

 Super Robo Video: సూపర్‌ రోబోను కనిపెట్టిన అఫ్గానిస్తాన్‌ యువతులు..!(వీడియో)

Follow us on