Footboard journy: స్డూడెంట్స్ డేంజర్ జర్నీ.. అంతలోనే షాక్..! ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతీక అంటున్న నెటిజనం..

|

Sep 06, 2022 | 9:47 AM

నగరాల్లోని సిటీ బస్సుల్లో ఎంత రద్దీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టూడెంట్స్, ఎంప్లాయిస్, వెండర్స్, వివిధ పనులకు వెళ్లే వారితో నిత్యం కిటకిటలాడుతుంటాయి. నిలబడడానికి


నగరాల్లోని సిటీ బస్సుల్లో ఎంత రద్దీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టూడెంట్స్, ఎంప్లాయిస్, వెండర్స్, వివిధ పనులకు వెళ్లే వారితో నిత్యం కిటకిటలాడుతుంటాయి. నిలబడడానికి కూడా ప్లేస్ లేని బస్సుల్లో ట్రావెల్ చేస్తూ ప్రమాదాల బారిన పడుతుంటారు. ఫుట్ బోర్డ్ పై వేలాడుతూ, రన్నింగ్ బస్సు ఎక్కుతూ ఇలా వివిధ రకాల విన్యాసాలు చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. ఇలాంటి ప్రయాణాలు ఎప్పుడు ఎలాంటి ప్రమాదంలో పడేస్తాయో తెలీదు. ఒక్కోసారి ప్రాణాలే కోల్పోతారు. ఇలాంటి జర్నీలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్లిప్ లో ఓ బస్సు పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తోంది. నిలబడేందుకూ ఖాళీ లేక కొంత మంది స్టూడెంట్స్ ఫుట్ బోర్డ్ పై నిల్చుని ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు.వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో తమిళనాడు స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సు ప్యాసింజర్లతో కిక్కిరిసిపోయింది. అయితే ప్రమాదవశాత్తు ఒక స్టూడెంట్ వేగంగా వెళ్తున్న బస్సు నుంచి కింద పడిపోయాడు. ఆ సమయంలో వాహనాల రాకపోకలు తక్కువగా ఉండడంతో అతనికి పెను ప్రమాదం తప్పింది. ఈ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ వీడియోను వీక్షించిన లక్షలమంది నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది ‘తమిళనాడు స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ నిర్లక్ష్యానికి ప్రతీక అని కొందరంటే.. ‘ఈ విద్యార్థులందరూ తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

Published on: Sep 06, 2022 09:47 AM