Students in Auto: పిల్లల్ని ఆటోలో స్కూల్‌కు పంపుతున్నారా..? ఈ డ్రైవర్ తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..
ఆటోరిక్షాల్లో ఎక్కువ మందిని కూర్చోబెట్టడం చట్టవిరుద్ధం..నేరం..అలా ఎక్కించుకున్న వారికి జరిమానాలు తప్పవు. వాహనంలో ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకోవడం చాలా ప్రమాదం కూడా.
ఆటోరిక్షాల్లో ఎక్కువ మందిని కూర్చోబెట్టడం చట్టవిరుద్ధం..నేరం..అలా ఎక్కించుకున్న వారికి జరిమానాలు తప్పవు. వాహనంలో ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకోవడం చాలా ప్రమాదం కూడా. పది రూపాయలు వస్తాయన్న ఆశతో ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు కొందరు ఆటోడ్రైవర్లు. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్విటర్‌లో షేర్ చేసిన ఈ వీడియో అందరినీ షాక్‌కి గురిచేస్తోంది.వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన పోలీసులు సదరు ఆటో డ్రైవర్‌పై చర్యలు తీసుకున్నారు. ఈ వీడియోని ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో చిత్రీకరించినట్టుగా తెలిసింది. ఇందులో ఓ ఆటో డ్రైవర్ విద్యార్ధులను ఆటోలో స్కూలుకి తీసుకెళ్తున్నాడు. అయితే పరిమితికి మించి స్కూలు పిల్లలను ఆటోలో ఎక్కించాడు. అంతేకాదు కొందరు విద్యార్ధులు ఆటో రూఫ్ పైన కూర్చున్నారు. ఈఘటన ఆగస్టు 26న జరిగింది. ఈ ఆటో స్థానిక ఆర్టీఓ కార్యాలయం, నకాటియా పోలీస్ ఔట్‌పోస్టు దాటిపోయింది. ఎవరీ ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆటోడ్రైవర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిద్రపోతున్నారా’ అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ‘ఇంత బాధ్యత లేని డ్రైవర్‌తో తమ పిల్లలను ఎలా పంపిస్తారు?’ అంటూ కామెంట్ చేశారు. పోస్ట్‌ను గమనించిన బరేలీ పోలీసులు ఆటో డ్రైవర్‌కు జరిమానా విధించారు. నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
