ఆకాశంలో మెరిసే వజ్రం.. కనువిందు చేసిన దృశ్యం

|

Sep 14, 2023 | 9:04 PM

సౌర కుటుంబంలో అత్యంత చిన్న గ్రహమైన బుధుడి ఫోటోను తీసింది నాసాకు చెందిన వ్యోమనౌక మెసెంజర్. నాసా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆ ఫోటోను చూస్తే చిన్నప్పుడు చదువుకున్న ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై పదాలు గుర్తుకు రాక మానవు. అచ్చంగా వజ్రాన్ని పోలి ఉన్న బుధుడు ఆకాశంలో వెలుగుజిలుగులతో నిజంగానే డైమండ్‌లా మెరిసిపోతున్నాడు. ఈ గ్రహం చుట్టూ తిరుగుతున్న మొట్టమొదటి నాసా వ్యోమనౌక మెసెంజర్ తీసిన ఈ అద్భుతమైన ఫొటోను..

సౌర కుటుంబంలో అత్యంత చిన్న గ్రహమైన బుధుడి ఫోటోను తీసింది నాసాకు చెందిన వ్యోమనౌక మెసెంజర్. నాసా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆ ఫోటోను చూస్తే చిన్నప్పుడు చదువుకున్న ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై పదాలు గుర్తుకు రాక మానవు. అచ్చంగా వజ్రాన్ని పోలి ఉన్న బుధుడు ఆకాశంలో వెలుగుజిలుగులతో నిజంగానే డైమండ్‌లా మెరిసిపోతున్నాడు. ఈ గ్రహం చుట్టూ తిరుగుతున్న మొట్టమొదటి నాసా వ్యోమనౌక మెసెంజర్ తీసిన ఈ అద్భుతమైన ఫొటోను నాసా సోషల్ మీడియాలో షేర్ చేయగానే క్షణాల్లో వైరల్ అయ్యింది. ఫోటోలో మెర్య్కురీ వజ్రకాంతి ధగధగలతో తళుకులీనుతోంది. సూర్యుడికి అత్యంత చేరువలో ఉన్నట్లు కనిపించే ఈ గ్రాహం సూర్యుడికి 58 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సైజులో భూమి సహజ ఉపగ్రహం చంద్రుడి కంటే కొంచెం పెద్దగా ఉండే ఈ గ్రహం మన సౌర కుటుంబంలోనే అత్యంత చిన్నది. ఈ గ్రహం చిన్నదే అయినప్పటికీ తన కక్ష్య చుట్టూ అత్యంత వేగంగా తిరుగుతుంది. ఈ కక్ష్యలోకి ప్రవేశించిన మొట్టమొదటి స్పేస్‌క్రాఫ్ట్ మెసెంజర్ బుధుడి ఉపరితలంపై ఉన్న రాళ్లల్లో రసాయన, ఖనిజ, భౌతిక వ్యత్యాసాల్ని గుర్తించేందుకు వీలుగా ఇలా బుధుడి కలర్ ఫోటోని తీసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

C-295 Aircraft: భారత వాయుసేనలోకి మరో బ్రాహ్మాస్త్రం !!

వావ్‌ !! వాటే క్రియేటివిటీ.. ఆరవై ఏళ్ల వయసులో అద్భుత సృష్టి

పిల్లలకు ఇంట్లో కమ్మగా వండి పెట్టండి… కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

తలకు సవరం.. భార్య డ్రెస్ వేసి అమ్మాయిలా మారాడు.. చివరకు ??

Ram Charan-Upasasana: మ్యాచింగ్ దుస్తుల్లో అదరగొట్టిన రామ్ చరణ్, ఉపాసన