ఆ గ్రామంలో చింత చెట్టే డాక్టర్! చెట్టు కాండం గుండా వెళితే రోగాలు మాయం!
ఎంత టెక్నాలజీ పెరిగినా, ఆధునిక వైద్యం ఎంత అభివృద్ధి చెందినా మన దేశంలోని కొన్ని గ్రామాల్లో వింత ఆచారాలు పాత తరం నమ్మకాలు ఇంకా కొనసాగుతున్నాయి. అలాంటి ఓ ప్రాంతమే కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో ఉన్న గొల్లరహట్టి గ్రామం. ఈ ఊళ్లో వందల ఏళ్లుగా ఓ చింతచెట్టు ఉంది. సాధారణంగా చింతచెట్లు.. నీడకు చింత కాయలకు ప్రసిద్ధి.
కానీ ఈ చెట్టు మరో కారణంతో ఇక్కడ పేరుగాంచింది. అది ఏంటంటే దీని కాండం మధ్యలో ఒక చిన్న రహస్య దారి ఉంది. అందులో ఒక మనిషి దూరేంత స్థలం ఉంది. ఆ చెట్టు కన్నం గుండా మూడు సార్లు వెళితే వ్యాధులు, జాతకంలో ఉండే దోషాలు.. మందులు పని చేయని రుగ్మతలు తీరుతాయని నమ్ముతారు. ఇక్కడికి వచ్చే భక్తులు ముందుగా గంగమ్మకు పూజ చేసి, ఆ తర్వాత చెట్టు మధ్యలోని ఆ రహస్య దారి గుండా బయటకు వస్తారు. చెట్టు కాండం నుంచి బయటికి వచ్చిన తర్వాత మనసుకు ఊరట, తమకు బాగైపోయిందనే కొత్త ఉత్సాహం, మానసిక ప్రశాంతత కలుగుతాయని స్థానికులు చెబుతారు. ఈ చెట్టును స్థానికులే కాదు బెంగుళూరు, మైసూరు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారూ దర్శిస్తారు. ఇక అక్కడికి వచ్చిన భక్తులను ఎవరూ డబ్బులు అడగరనీ, అలాగే చెట్టు గురించి ప్రకటనలు కూడా చేయరని చెబుతుంటారు. అనేక రోగాలకు ప్రకృతి ద్వారా వైద్యం అంది ఉపశమనం లభించడంతో ఏటా వేలాది మంది భక్తులు అక్కడికి వస్తుంటారు. ఇలాంటి మరొక చింత చెట్టు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా హరిదాసు నగర్ గ్రామ సమీపంలో వ్యాధులను నివారించే వందల ఏళ్ల నాటి చింత చెట్టు ఉందని చెబుతుంటారు. ఈ చెట్టు కాండం మధ్యలో నుంచి దూరి పెద్దలు, పిల్లలు ఎవరు వెళ్లినా వారి రోగాలు నయం అవుతాయని అక్కడి ప్రజల నమ్మకం. అంతేకాదు ఆ ప్రాంతంలో అరుదైన మూలికలు ఉన్నాయని స్థానికులు చెబుతుంటారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇప్పుడంటే జ్యోతిష్యాలు కానీ.. అప్పట్లో మనోడి కథ వేరేలెవల్!
భర్తతో స్టార్ హీరోయిన్ కటీఫ్? ఇన్‌స్టాతో బట్టబయలు
జాన్వీ బిగ్ స్కెచ్.. చరణ్ సినిమాతో టార్గెట్ అఛీవ్డ్
తొమ్మిదేళ్ల కలను నిజం చేసుకునేందుకు.. పెళ్లి వాయిదా వేసుకున్న స్టార్ హీరో