Big Family: వంద దాటిన ముసా హసహ్య కుటుంబం.. ముసా హసహ్యకు 12 మంది భార్యలు, 102 మంది సంతానం.. మరోసారి..
ఒకరిద్దరు పిల్లలు ఉంటేనే వారి ఆలనాపాలనా చేసేందుకు తల్లిదండ్రులు నానా తంటాలు పడుతుంటారు.. అలాంటిది ఏకంగా 12 మందిని పెళ్లి చేసుకుని 102 మంది పిల్లలను కని.. తన కుటుంబాన్ని విస్తరించాడు ఓ వ్యక్తి.
ఒకరిద్దరు పిల్లలు ఉంటేనే వారి ఆలనాపాలనా చేసేందుకు తల్లిదండ్రులు నానా తంటాలు పడుతుంటారు.. అలాంటిది ఏకంగా 12 మందిని పెళ్లి చేసుకుని 102 మంది పిల్లలను కని.. తన కుటుంబాన్ని విస్తరించాడు ఓ వ్యక్తి. తాజా సదరు వ్యక్తి సంచలన ప్రకటన చేశాడు. ఇక తాను పిల్లల్ని కనబోనని ప్రకటించాడు. తన భార్యలు పిల్లలు పుట్టకుండా ప్రస్తుతం మందులు వాడుతున్నారని, ఇకపై పిల్లల్ని కనబోనని ప్రకటించేశాడు. ఉగాండాకు చెందిన ముసా హసహ్య అనే 67 ఏళ్ల వ్యక్తి చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నారని కొందరు అంటుండగా, వంద మంది పిల్లల్ని కన్నాక ఈ ఆలోచన రావడం గమనార్హం అంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని కూడా చెప్పాడండీ ఈ ముసా. కుటుంబ పోషణకు తన ఆదాయం సరిపోవడం లేదట. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. తన దగ్గర ఉన్న పరిమిత వనరుల కారణంగా కుటుంబ మరింత విస్తృతమైతే మరింత భారం అవుతుందంటున్నాడు. అందుకే ఇకపై పిల్లల్ని కనకూడదని నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. ఇందుకు అతని భార్యలను కూడా ఒప్పించాడట. ప్రస్తుతం ముసాకు 568 మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు. ఉగాండాలోని బుగిసాలో అతడికి 12 బెడ్రూంలు ఉన్న ఇళ్లు ఉంది. అయితే తన మనవలు, మనవరాళ్లు అందరి పేర్లు తెలియవని ముసా చెబుతున్నాడు. అతడు మొదటి పెళ్లి 1971లో చేసుకున్నాడు. అప్పుడు అతడి వయసు 16 సంవత్సరాలు. ఆ రెండేళ్లకే కూతురు పుట్టడంతో అతడు మొదటిసారి తండ్రి అయ్యాడు. గ్రామ చైర్‌పర్సన్ అయిన ముసా, వ్యాపారవేత్త కూడా. తనకు డబ్బు, భూమి ఉన్నందున కుటుంబాన్ని పెంచుకోవాలని అనుకున్నాడట. అందుకే ఎక్కువ మంది భార్యల్ని చేసుకున్నట్లు తెలిపాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos