Mumbai: కాలేజ్‌ ఫెస్ట్ లో సాంగ్ కు డ్యాన్స్.! డ్యాన్స్ చేసిన యువతిపై దారుణమైన ముద్ర!

Updated on: Feb 21, 2024 | 5:34 PM

తన డ్యాన్స్ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేసి దానిపై కోఠా అని రాసి ప్రచారం చేస్తున్నాడంటూ ఓ కొరియోగ్రాఫర్‌ పోస్టుకు ముంబై పోలీసులు స్పందించారు. పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. ఇండియన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఏర్పాటు చేసిన కాలేజ్ ఫెస్ట్‌లో శ్రుతి పరీజా డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను ప్రతీక్ ఆర్యన్ అనే వ్యక్తి తన ఎక్స్‌లో షేర్ చేస్తూ ఆమెను అభ్యంతరకర పదంతో పేర్కొన్నాడు.

తన డ్యాన్స్ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేసి దానిపై కోఠా అని రాసి ప్రచారం చేస్తున్నాడంటూ ఓ కొరియోగ్రాఫర్‌ పోస్టుకు ముంబై పోలీసులు స్పందించారు. పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. ఇండియన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఏర్పాటు చేసిన కాలేజ్ ఫెస్ట్‌లో శ్రుతి పరీజా డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను ప్రతీక్ ఆర్యన్ అనే వ్యక్తి తన ఎక్స్‌లో షేర్ చేస్తూ ఆమెను అభ్యంతరకర పదంతో పేర్కొన్నాడు. సాంస్కృతిక కార్యక్రమం పేరుతో ఐటెం సాంగ్స్‌కు చిందేశారని విమర్శించిన ప్రతీక్.. భారత్‌లో విద్యావ్యవస్థతోపాటు సంస్కృతి కూడా ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 25 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆ వీడియోలో వున్న మహిళను తానేనని పేర్కొంటూ, తన అనుమతి లేకుండా పోస్ట్ చేయడంపై శ్రుతి అభ్యంతరం వ్యక్తం చేసింది. వీడియోను తొలగించాలని కోరింది. తాను ఆ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించానని, ఆడిటోరియం కోరిక మేరకు తాను ఆ డ్యాన్స్ చేసినట్టు గుర్తు చేసింది. కాబట్టి ఆ వీడియోను తొలగించాలని ప్రతీక్‌ను కోరింది. పలుమార్లు అభ్యర్థించినప్పటికీ ఆ వీడియోను తొలగించేందుకు నిరాకరించడంతో శ్రుతి ఈ మొత్తం విషయాన్ని ఎక్స్ ద్వారా పంచుకుని ఆవేదన వ్యక్తం చేసింది.

దీనికి ప్రతీక్ తీవ్రంగా స్పందించాడు. ఆ వీడియోపై ఆమెకు ఎలాంటి హక్కులు లేవని స్పష్టం చేశాడు. ముందే తనతో మర్యాదగా మాట్లాడి వీడియోను తొలగించమని ఉంటే ఆ పని చేసి ఉండేవాడినని, కానీ కటకటాల వెనక్కి పంపిస్తానని హెచ్చరించడంతో ఇప్పుడు దానిని డిలీట్ చేయాలని అనుకోవడం లేదని, ఏం చేసుకుంటావో చేసుకోవాలని తేల్చిచెప్పాడు. దీంతో ఆమె ఎక్స్ ద్వారా అన్ని వివరాలను పంచుకుని ఆవేదన వ్యక్తం చేసింది. తానో కొరియోగ్రాఫర్‌నని పేర్కొంది. ఆమె పోస్టుకు ముంబై పోలీసులు స్పందించారు. పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. తాజాగా శ్రుతి మీడియాతో మాట్లాడుతూ.. కాపీరైట్ క్లెయిమ్‌పై చివరికి ఆ వీడియో డిజేబుల్ అయినట్టు పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..