కదులుతున్న కారుపై కవ్విస్తూ డాన్స్ చేస్తున్న మహిళా.. ఫైర్ అవుతున్న నెటిజెన్స్

Updated on: Aug 01, 2025 | 1:16 PM

రీల్‌తో ఫేమస్‌ అయ్యేందుకు ఒక జంట ప్రయత్నించింది. ఒక వ్యక్తి లగ్జరీ కారు డ్రైవ్‌ చేయగా బానెట్‌పై నిల్చొన్న మహిళ ‘ఆరా డ్యాన్స్‌’ చేసింది. వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు జంటను అరెస్ట్‌ చేశారు. నవీ ముంబైకు చెందిన నజ్మిన్ సుల్దే, అల్ఫేష్ షేక్ కలిసి వైరల్‌ వీడియో కోసం ప్రయత్నించారు. మెర్సిడెస్ కారును అల్ఫేష్ డ్రైవ్‌ చేశాడు.

బానెట్‌పై ప్రమాదకరంగా నిల్చొన్న నజ్మిన్‌ కారు కదులుతుండగా బాగా పాపులరైన ‘ఆరా ఫార్మింగ్’ డ్యాన్స్ చేసింది. ఈ వీడియో క్లిప్‌ వైరల్‌ అయ్యింది. దీంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. జంటను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ప్రజా భద్రతకు ప్రమాదం కలిగించడం వంటి పలు సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత షరతులతో వారిని విడిచిపెట్టారు. నజ్మిన్ సుల్దే, అల్ఫేష్ షేక్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. వైరల్‌ స్టంట్‌ ద్వారా తాము తప్పు చేశామని అన్నారు. ఇందులో తనదే పూర్తిగా తప్పని నజ్మిన్‌ తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రియురాలిని వశం చేసుకోవాలని చేయకూడని పని చేసాడు.. చివరికి

‘మనం కొట్టినమ్‌ అంటూ..’ VDకి రష్మిక ఎమోషనల్ ట్వీట్‌

కింగ్డమ్‌ సినిమాకు.. కేసీఆర్ మనవడి అదిపోయే రివ్యూ..