అర్థరాత్రి కదులుతున్న బెడ్ !! ఏంటా అని చెక్ చేయగా గుండె గుభేల్ !!

|

Aug 07, 2022 | 6:31 PM

ముంబైలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ టీనేజ్ అమ్మాయి షాకింగ్ అనుభవాన్ని ఎదుర్కొంది. ములుంద్‌కు చెందిన ఒక కుటుంబం గాఢ నిద్రలో ఉన్న సమయంలో వారు నిద్రిస్తున్న పరుపు కింద నుంచి వింత శబ్ధాలు వచ్చాయి.

ముంబైలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ టీనేజ్ అమ్మాయి షాకింగ్ అనుభవాన్ని ఎదుర్కొంది. ములుంద్‌కు చెందిన ఒక కుటుంబం గాఢ నిద్రలో ఉన్న సమయంలో వారు నిద్రిస్తున్న పరుపు కింద నుంచి వింత శబ్ధాలు వచ్చాయి. అంతేకాదు బెడ్ అడుగున ఏదో కదులుతున్నట్లు అనిపించింది. నిద్రలో ఉన్నారు కాబట్టి వారు పెద్దగా పట్టించుకోలేదు. కాస్త అసౌకర్యంగా అనిపించడంతో.. ఆ బెడ్‌పై నిద్రిస్తున్న 16 ఏళ్ల టీనేజర్ మేల్కొని అరవడం మొదలెట్టింది. తల్లిదండ్రులు నిద్రలో కలవరిస్తుందని భావించి పట్టించుకోలేదు. దీంతో ఆ టీనేజర్ తల్లిని లేపింది. దీంతో అందరూ అలెర్టయి.. బెడ్‌షీట్‌లను దులిపారు. అప్పుడు కనిపించిన దృశ్యం చూసి వారంతా కంగుతిన్నారు. బెడ్ షీట్ల కింద ఓ కొండచిలువ కనిపించింది. దీంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇరుగుపొరుగు వారు కూడా గుమిగూడి స్నేక్ కాచర్‌కి ఫోన్ చేశారు. వారు అక్కడికి చేరుకునేలోగా పాము బెడ్ రూమ్ నుంచి కిచెన్‌లోకి చేరుకుంది. అనంతరం స్నేక్ క్యాచర్స్ జాగ్రత్తగా 3 అడుగుల పొడవున్న కొండచిలువను బంధించి.. తీసుకువెళ్లి అడవిలో వదిలేశారు. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ సమీపంలో ఉన్న ములుంద్‌కు పాములు తరచుగా వస్తుంటాయి. దీంతో ఆ పార్క్ సమీప ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని స్థానిక అధికారులు సూచిస్తున్నారు. సో.. బీ అలెర్ట్.. రైనీ సీజన్‌లో పాములు తెగ కనిపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండకపోతే.. ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిన్న కర్మ చేసేందుకు స్మశానానికి వెళ్లగా కపాలం మిస్సింగ్

మన స్టైలే వేరప్ప.. కిందపడ్డా.. లేచి డ్యాన్స్.. బుడ్డొడి కాన్ఫిడెన్స్‏కు నెటిజన్లు ఫిదా

Viral: కుక్క-పిల్లి ప్రేమ కథ !! ‘వారి ప్రేమకు అడ్డురాకండి’

స్టైల్‌గా బైక్‌ టర్న్‌ చేయాలనుకున్నాడు !! కానీ సీన్‌ కట్‌ చేస్తే !!

Naga Chaitanya: ‘మళ్లీ ప్రేమలో పడతా..’ ఓపెన్‌గా చెప్పిన నాగచైతన్య

 

Follow us on