ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్‌ వైర్లను లెక్కచేయని తల్లి

Updated on: Jan 22, 2026 | 9:35 AM

"తల్లి ప్రేమ ఈ సృష్టిలో గొప్పది. బిడ్డ ప్రమాదంలో ఉంటే తన ప్రాణాలను సైతం లెక్కచేయదు. హైటెన్షన్ వైర్లపై చిక్కుకున్న తన పిల్లను రక్షించడానికి ఓ తల్లి కొండముచ్చు చేసిన సాహసం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాణాలను పణంగా పెట్టి తన బిడ్డను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చిన ఈ వీడియో లక్షలాది మందిని ఆకట్టుకుంది, తల్లి ప్రేమకు గొప్ప నిదర్శనంగా నిలిచింది."

ఈ సృష్టిలో అన్నింటి కంటే గొప్పది తల్లి ప్రేమ. బిడ్డ కోసం తల్లి ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. బిడ్డ ప్రమాదంలో ఉందంటే తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతుంది. తల్లి ప్రేమ విషయంలో మనుషులు, జంతువులు అనే తేడా లేదు. ఓ కొండముచ్చు తన బిడ్డను రక్షించుకోవడం కోసం ప్రాణాంతక సాహసం చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎక్స్ యూజర్ ఒకరు ఆ అద్బుత వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కోతి చేష్టలంటే ఇదేనేమో. ఎలా వెళ్లిందో తెలియదు కానీ ఓ పిల్ల కొండముచ్చు హైటెన్షన్‌ వైర్ల పైన వేలాడింది. అంతెత్తు నుంచి కిందకు దూకడానికి ధైర్యం చాలక ఆ పిల్ల తీవ్రంగా భయపడిపోయింది. ప్రమాదం నుంచి ఎలా తప్పించాలా అని తల్లి కొండముచ్చు ఆరాటపడింది. భవనం గోడ మీద కూర్చుని బిడ్డను రక్షించుకునే మార్గాల కోసం వెతికింది. చివరకు కొండముచ్చు భవనం గోడపై నుంచి ఒక్క ఉదుటున హైటెన్షన్ వైర్లపైకి దూకి తన బిడ్డను ఎత్తుకుని తిరిగి భవనం గోడ పైకి తీసుకొచ్చింది. హైటెన్షన్ వైర్ల మీద చిక్కుకున్న పిల్లను తన ప్రాణాలను పణంగా పెట్టి కాపాడింది. పిల్ల కొండముచ్చు అరుపులు విన్న స్థానికులు ఏం జరుగుతుందా అని ఎంతో ఉత్కంఠగా ఊపిరిబిగపట్టి చూసారు. తల్లి కొండముచ్చు చేసిన సాహసం అక్కడున్న వారినీ ఆకట్టుకుంది. వైరల్ వీడియోను ఇప్పటివరకు 3.8 లక్షల కంటే ఎక్కువ మందే వీక్షించారు. 11 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసారు. తల్లి ప్రేమను మించిన రక్షణ ఎక్కడా ఉండదని చాలా మంది కామెంట్లు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jr NTR: దండోరా మూవీపై ఎన్టీఆర్ రివ్యూ

Akshay Kumar: ప్రమాదం నుంచి తప్పించుకోవడమే కాదు క్షతగాత్రులకు సాయం చేసిన స్టార్ హీరో

Chiranjeevi: ‘మీరు లేనిదే.. నేను లేను’ మెగాస్టార్ ఎమోషనల్

Naveen Polishetty: రూ.100 కోట్ల ఆనందంలో.. నవీన్ భావోద్వేగం

Chiranjeevi: బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌లో.. మెగాస్టార్ ఆల్ టైం రికార్డ్‌