Mosquitoes: దోమలు కొందరినే కుట్టడానికి కారణం.. ? శరీర వాసనలలో మార్పులా..?
కొన్ని వైరస్‌లు చర్మ వాసనలను సైతం మార్చేసి దోమలు కుట్టేందుకు ప్రేరేపించేలా చేయగలవని పరిశోధనల్లో తెలిసింది. కనెక్టికట్ యూనివర్సిటీలోని ఇమ్యూనాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వాంగ్ ఎలుకలపై పరిశోధనలు
కొన్ని వైరస్‌లు చర్మ వాసనలను సైతం మార్చేసి దోమలు కుట్టేందుకు ప్రేరేపించేలా చేయగలవని పరిశోధనల్లో తెలిసింది. కనెక్టికట్ యూనివర్సిటీలోని ఇమ్యూనాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వాంగ్ ఎలుకలపై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని గుర్తించారు. వైరల్ జ్వరాలైన మలేరియా, ఎల్లో ఫీవర్, డెంగ్యూ సోకిన వారిలో దోమలను ఆకర్షించేలా శరీర వాసన మారుతుందని తేల్చారు. తద్వారా ఏటా ప్రపంచవ్యాప్తంగా దోమకాటు ద్వారా తలెత్తే వ్యాధులకు10 లక్షల మంది చనిపోతున్నారని తెలిపారు. ఈ బాధితులను కుట్టిన దోమ ఆ వైరస్‌ని, అది కుట్టిన మరో వ్యక్తికి వ్యాపింపజేస్తుంది. ఇలా అతిథిపై వాలి కుట్టేందుకు దోమలను ప్రేరేపించే అంశాలను పెంగ్వా వాంగ్ గుర్తించారు. వైరస్ బాధిత జీవి చర్మంపై అసిటోఫెనోన్ అనే ఒక సువాసన తయారవుతుందని, దీనివల్లనే ఆరోగ్యవంతుల కంటే 10 రెట్లు ఎక్కువగా వైరస్ బాధితులనే కుడుతున్నట్లు గుర్తించారు.ప్రయోగంలో చివరగా వైరస్ బాధిత ఎలుకలకు విటమిన్ ఏను అందజేసి, వాటి శరీరంపై బాసిల్లస్ బ్యాక్టీరియాను తగ్గించినప్పుడు తిరిగి ఆరోగ్యవంతంగా మారాయి. మనుషులపైనా ఇవే ప్రయోగాలను చేపట్టి, ఫలితాల ఆధారంగా అంతిమంగా వాటిని బాధితులకు వర్తింపజేయడానికి ప్రయత్నిస్తామని పెంగ్వా వాంగ్ చెప్పారు. తమ ప్రయోగాలు పలు ఆసియా, ఆఫ్రికా దేశాల ప్రజలకు ఎంతో మేలుచేస్తాయన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?