Monkeypox: మంకీపాక్స్‌ భారత్‌లోకి ఎంట్రీ.! కరోనా కంటే డేంజర్ గా మంకీపాక్స్‌.!

|

Sep 12, 2024 | 6:00 PM

ప్రపంచాన్ని పట్టిపీడించిన కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే కనుమరుగవుతోంది.. దాదాపు నాలుగేళ్ల తర్వాత కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.. ఈ క్రమంలోనే మరో మహమ్మారి మంకీపాక్స్‌ టెన్షన్‌ పుట్టిస్తోంది. దాదాపు వంద దేశాలకు ఈ మహమ్మారి విస్తరించింది.. ఇప్పటివరకు ఆఫ్రికన్, యూరోపియన్ దేశాల్లో హడలెత్తించిన మంకీపాక్స్‌ ఇప్పుడు భారత్‌లో కూడా అలజడి రేపింది.

ప్రపంచాన్ని పట్టిపీడించిన కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే కనుమరుగవుతోంది.. దాదాపు నాలుగేళ్ల తర్వాత కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.. ఈ క్రమంలోనే మరో మహమ్మారి మంకీపాక్స్‌ టెన్షన్‌ పుట్టిస్తోంది. దాదాపు వంద దేశాలకు ఈ మహమ్మారి విస్తరించింది.. ఇప్పటివరకు ఆఫ్రికన్, యూరోపియన్ దేశాల్లో హడలెత్తించిన మంకీపాక్స్‌ ఇప్పుడు భారత్‌లో కూడా అలజడి రేపింది. తాజాగా.. మంకీపాక్స్‌ కేసు నమోదవ్వడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మరోకరికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే.. మంకీపాక్స్ మహమ్మారి తీవ్రతను ఎదుర్కొంటున్న దేశం నుంచి ఇటీవలే భారత్ కు వచ్చిన ఒక యువకుడికి మంకీపాక్స్ వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ప్రభుత్వం సోమవవారం వెల్లడించింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ లో Mpox అనుమానిత కేసుగా గుర్తించిన అధికారులు.. ఐసోలేషన్ కు తరలించారు. రోగి నుంచి రక్త నమూనాలను సేకరించి ఎంపాక్స్‌ నిర్ధారణ కోసం ల్యాబ్ కు పంపించగా.. పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. యువకుడి పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వ్యాధి తీవ్రతపై జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం ముందస్తుగానే అంచనాలు వేసిందని ఆందోళన చెందాల్సి అవసరం లేదని పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on