Viral Video: కోతి ముందే కుప్పిగంతులా !! తిక్క కుదిర్చిందిగా !!
సాధారణంగా కోతులు చాలా అల్లరి చేస్తాయి. వాటి అల్లరి ఎంత ఆకట్టుకుంటుందో.. వాటి దాడి కూడా అంతే భీకరంగా ఉంటుంది. అలాంటి కోతి ముందు ఓ యువకుడు కోతి చేష్టలు చేయబోయాడు.
సాధారణంగా కోతులు చాలా అల్లరి చేస్తాయి. వాటి అల్లరి ఎంత ఆకట్టుకుంటుందో.. వాటి దాడి కూడా అంతే భీకరంగా ఉంటుంది. అలాంటి కోతి ముందు ఓ యువకుడు కోతి చేష్టలు చేయబోయాడు. దాన్ని ఇమిటేట్ చేస్తే అది ఊరుకుంటుందా.. అదును చూసి యువకుడికి గట్టి షాక్ ఇచ్చింది. దెబ్బకు బాబోయ్ అంటూ అక్కడి నుంచి జారుకున్నాడు. అసలేం జరిగిందంటే.. ఓ యువకుడు తన సన్నిహితులతో కలిసి ‘జూ’ కి వెళ్లాడు. అక్కడ ఒక బోనులో కోతి ఉంది. దానిని ఆ యువకుడు ఆట పట్టించే ప్రయత్నం చేశాడు. అయితే, ఆ కోతి ఊహించని రీతిలో రివర్స్ షాక్ ఇచ్చింది. అతని జుట్టు పట్టుకుని గట్టిగా పీకేసింది. యువకుడు ఎంత గింజుకున్నా వదల్లేదు. చివరకు ఎలాగోలా ఆ కోతి చెర నుంచి తప్పించుకున్నాడు యువకుడు. క్షణం ఆలస్యం చేయకుండా అక్కడ్నుంచి జారుకున్నాడు. అయితే, ఈ సన్నివేశాన్నంతా ఫోన్ కెమెరాలో రికార్డ్ చేయగా.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్తా వైరల్ అయ్యింది. కోతిముందే కుప్పిగంతులా.. తిక్కకుదిర్చిందిగా..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
AP: ఇంగ్లీష్ ఇరగదీస్తున్న ఏపీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు.. వీరి స్లాంగ్ వింటే మతిపోవాల్సిందే
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

