అయోధ్య రాముణ్ణి చూసేందుకు ఆంజనేయుడు వచ్చాడా?
జనవరి 22న అయోధ్యలో రాముడు కొలువుదీరాడు. ప్రధాని మోదీ చేతుల మీదుగా బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది . విల్లు, బాణం ధరించి, బంగారు ఆభరణాలతో అద్భుతంగా అలంకరించిన బాలరాముడిని చూసి భక్తకోటి పులకరించింది. చిరు దరహాసం, ప్రసన్న వదనంతో బాలరాముడి దర్శన భాగ్యం కలగడం వల్ల అతిథులు తన్మయత్వం చెందుతున్నారు. అయితే తాజాగా అయోధ్య రామమందిరంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది.
జనవరి 22న అయోధ్యలో రాముడు కొలువుదీరాడు. ప్రధాని మోదీ చేతుల మీదుగా బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది . విల్లు, బాణం ధరించి, బంగారు ఆభరణాలతో అద్భుతంగా అలంకరించిన బాలరాముడిని చూసి భక్తకోటి పులకరించింది. చిరు దరహాసం, ప్రసన్న వదనంతో బాలరాముడి దర్శన భాగ్యం కలగడం వల్ల అతిథులు తన్మయత్వం చెందుతున్నారు. అయితే తాజాగా అయోధ్య రామమందిరంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. మంగళవారం సాయంత్రం ఓ వానరం ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించింది. ఆలయ దక్షిణ ద్వారం నుంచి ఓ వానరం రామాలయ గర్భగుడిలోకి ప్రవేశించడం వల్ల అక్కడున్న భక్తులు, భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వానరం రామయ్య ఉత్సవ విగ్రహాన్ని నేలపై తోసేస్తుందన్న భయంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. పరుగెత్తుకెళ్లి కోతిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అప్పుడు కోతి ఆలయ ఉత్తర ద్వారం వైపు వెళ్లింది. ఆ గేటు మూసి ఉండడం వల్ల తూర్పు ద్వారం గుండా వేలాది భక్తులను దాటుకుని ఎవరికీ ఇబ్బంది పెట్టకుండా బయటకు వెళ్లిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెట్టు నుంచి ఉబికి వస్తున్న పాలు.. వింత ఘటన ఎక్కడో తెలుసా ??
భారీ డేటా లీక్.. చరిత్రలో ఇదే అతి పెద్ద ఘటన
విద్యార్థులతో కలిసి భోజనం చేసి, ఆటలాడిన కొండముచ్చు
Aadhaar Cards: నీట్లో కొట్టుకొస్తున్న ఆధార్ కార్డులు.. జిల్లా కలెక్టర్ సీరియస్