హనుమాన్‌ ఆలయంలో అరుదైన ఘటన !! హనుమంతుని దర్శనం తర్వాత ప్రాణాలు విడిచినకోతి

|

Apr 30, 2022 | 8:46 AM

మానవుడు కోతిని హనుమంతుడి ప్రతిరూపంగా భావిస్తాడు. అతిబలవంతుడైన హనుమంతుడు వానర రూపంలో శ్రీరాముడికి ఎంతగానో సహకరించాడు.

మానవుడు కోతిని హనుమంతుడి ప్రతిరూపంగా భావిస్తాడు. అతిబలవంతుడైన హనుమంతుడు వానర రూపంలో శ్రీరాముడికి ఎంతగానో సహకరించాడు. శ్రీరాముడినే తన సర్వస్వంగా భావించి గుండెల్లో నిలుపుకున్నాడు. అలాంటి హనుమంతుని ఆలయంలో ఆద్భుతం జరిగింది. దీనిని అద్భుతం అనేకంటే దైవ సంకల్పం అనొచ్చేమో… ఆశ్చర్యకరమైన విషయమేంటంటే కోతులకు తమ అంత్యకాలం ముందే తెలుస్తుందట. అందుకేనేమో ఆ వానరం తను చనిపోయే ముందు తన ఇష్ట దైవాన్ని దర్శించుకుందామని హనుమంతుని ఆలయంలోకి వచ్చింది. తన దైవాన్ని తనివితీరా దర్శంచుకుంది. తన విన్నపాన్ని వినిపించింది. చివరికి ఆ స్వామి సమక్షంలోనే తనువు చాలించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో జరిగింది. ఈఘటన అక్కడి భక్తులను కలచివేసింది. కోతి మరణంతో భక్తులు ఉద్వేగానికి గురయ్యారు. ఆ వానరం మారుతిలో ఐక్యం అయిందని, అది దైవేచ్ఛగా భావించి ఆలయ ప్రాంగణంలోనే వానరాన్ని సమాధి చేసి తమ భక్తిని చాటుకున్నారు. బహుశా ఆ వానరం కూడా స్వామివారిని అదే కోరుకుందేమో..!

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Portable AC: సామాన్యులకి అందుబాటులో పోర్టబుల్‌ ఏసీలు !!

చనిపోయాడన్న వ్యక్తి పాడె మీద నుంచి లేచి నీళ్లు తాగాడు !! ఆస్పత్రికి తీసుకెళ్తే ??

Viral Video: మెగాస్టార్‌ పాటకు డాన్స్‌ అదరగొట్టిన వృద్ధుడు !!