యువకులతో పోటీపడి డాన్స్ చేసిన కోతి

Updated on: Aug 09, 2025 | 7:59 PM

పిల్లలు అల్లరి చేస్తుంటే.. కోతి వేషాలు ఆపు.. అని తల్లులు విసుక్కుంటుంటారు. అయితే, కోతి చేతనే అల్లరి చేష్టలు చేయించిన యువకుల వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అసలే కోతి.. దానికి ఈ కొంటె కుర్రాళ్లు తోడయ్యారు. ఇటు కోతి..అటు యువకులు రెచ్చిపోయారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో కొందరు యువకులు ఎత్తైన కొండ ప్రదేశాల్లో పర్యటిస్తున్నారు.

అక్కడ వారికి ఒక కోతి కనిపించింది. దానిని చూడగానే వారు బిగ్గరగా అరవడం, డాన్స్ చేయటం ప్రారంభించారు. వారి గోలకు ఆ కోతి భయంతో అక్కడినుంచి పారిపోకపోగా. అచ్చం వారు చేసినవన్నీ చేయటం మొదలుపెట్టింది. అది చూసిన ఆ యువకులు మరింత ఉత్సాహంగా కొత్త కొత్త స్టెప్పులు వేయగా.. తగ్గేదేలే అన్నట్లుగా ఆ కోతి కూడా అచ్చం అలాగే చేయటానికి ప్రయత్నించింది. ఎత్తైన కొండ కొమ్ము మీద ఉన్నా.. ఏ మాత్రం భయం లేకుండా ఆ యువకుల్లాగే డాన్స్ చేస్తున్న ఆ కోతిని ఓ యూజర్ వీడియో తీసి.. తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను దాదాపు 2 లక్షలమందికి పైగా వీక్షించారు. వేలాదిమంది లైక్‌ చేస్తూ..తమదైన శైలిలో కామెంట్లు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అద్దె కొంప.. సొంత ఇల్లు.. ఏది బెటర్..?

ఒక్క క్లిక్‌తో మీ బ్యాంకు ఖాతా ఖాళీ.. జాగ్రత్త

భర్త ఆచూకీ లేదంటూ బోరున ఏడ్చిన భార్య.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌

గుండె సమస్యలను క్షణాల్లో గుర్తించే ఏఐ టెక్నాలజీ

ట్రంప్‌ టారిఫ్‌లపై.. సొంత పార్టీలో సెగ! భారత్‌ను దూరం చేసుకొవద్దని హితవు