Monkey Viral Video: నడుముతో రింగ్ ను గిరగిరా తిప్పేస్తూ.. కోతి పాట్లు చూస్తే పడీపడీ నవ్వాల్సిందే..

|

Jul 19, 2022 | 10:08 AM

మీరెప్పుడైనా సర్కస్ కు వెళ్లారా.. అక్కడ రకరకాల జంతువులు ఫీట్లు చేస్తూ మనల్ని అలరిస్తూ ఉంటాయి. అయితే సర్కస్ లో రింగ్‌ను అమ్మాయిలు నడుముపై గిరగిరా తిప్పుతూ


మీరెప్పుడైనా సర్కస్ కు వెళ్లారా.. అక్కడ రకరకాల జంతువులు ఫీట్లు చేస్తూ మనల్ని అలరిస్తూ ఉంటాయి. అయితే సర్కస్ లో రింగ్‌ను అమ్మాయిలు నడుముపై గిరగిరా తిప్పుతూ డాన్స్‌ చేస్తుంటారు. ఈ రింగ్ డ్యాన్స్ చూస్తే ఔరా అనిపిస్తుంది. అయితే ఈ హులా హూప్‌ డ్యాన్స్‌ను ఓ కోతి ఇరగతీసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ కోతి.. రింగ్ ను నడుముపై పెట్టుకుని గిరగిరా తిప్పేస్తుంది. మనుషులే ఎంతో సాధన చేస్తే కానీ అలా చేయలేరు. ఈ వానరం ఎంత ప్రాక్టీస్‌ చేసిందో ఏమో కానీ.. భలే తిప్పేస్తుంది. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీనికి ‘బెస్ట్ హులా హూప్’ అని టైటిల్ ఇచ్చారు. ఈ వీడియోను వీక్షిస్తున్నారు. వందలాది మంది వీడియోను లైక్ చేస్తూ.. రకరకాల కామెంట్స్‌తో రీ ట్వీట్‌ చేస్తున్నారు. ఈ కోతి చాలా బాగా డ్యాన్స్ చేస్తోందని ఒకరు, కోతి డ్యాన్స్ కు ఫిదా అయ్యామని మరొకరు, హులా హూప్‌ ఎలా చేయాలో ఆ కోతి వద్ద ట్రైనింగ్ తీసుకోవాలంటూ రకరకాలుగా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Published on: Jul 19, 2022 10:08 AM