MLA Son: విమానం తయారు చేసిన ఎమ్మెల్యే కొడుకు.! ఎందుకో తెలుసా..? పూర్తి వివరాలు..
కోవిడ్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌లో చాలా మంది జీవితాలు దుర్భరంగా మారితే.. మరికొంత మందికి లక్కీగా కలిసి వచ్చాయి. ఈ ఖాళీ సమయంలో కొత్తకొత్త ఆవిష్కరణలు చేపట్టారు. ఇలా లాక్‌డౌన్ సమయంలో ఓ హెలికాప్టర్‌ను కనిపెట్టాడు..
కోవిడ్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌లో చాలా మంది జీవితాలు దుర్భరంగా మారితే.. మరికొంత మందికి లక్కీగా కలిసి వచ్చాయి. ఈ ఖాళీ సమయంలో కొత్తకొత్త ఆవిష్కరణలు చేపట్టారు. ఇలా లాక్‌డౌన్ సమయంలో ఓ హెలికాప్టర్‌ను కనిపెట్టాడు కేరళ ఎమ్మెల్యే ఏవీ థమరాక్షన్ కొడుకు అశోక్ అలిసెరిల్ థమరాక్షన్. తన కుటుంబం కోసం ఏకంగా ఓ మినీ హెలికాప్టర్‌నే రెడీ చేశాడు.కేరళలోని పాలక్కాడ్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తిచేశాడు. అనంతరం మాస్టర్స్ డిగ్రీ కోసం 2006లో యూకే వెళ్లాడు. ప్రస్తుతం అక్కడే ఫోర్డ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. భార్యపిల్లలతో అక్కడే ఉంటున్నాడు. కొవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో ప్రైవేట్ విమానాన్ని నిర్మించాలనే ఆలోచన అతనికి తట్టింది. ఇందుకు 1.4 కోట్ల రూపాయలు ఖర్చుచేసి, అశోక్ తన కల నెరవేర్చుకున్నాడు. ఈ విమానం చూస్తుంటే కొత్తబొమ్మలా అనిపిస్తున్నదని అశోక్ ఆనందం వ్యక్తం చేశాడు. కుటుంబ సభ్యులమంతా కలిసి డబ్బు ఆదా చేశామని, ఆ డబ్బుతో నాలుగు సీట్ల విమానాన్ని తయారుచేశానన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..