Traffic in Miaoram: అదేదో సీఎం కాన్వాయ్ అనుకునేరు..అసలు విషయం తెలిస్తే షాకే..! మన దగ్గర ఇలా ఎప్పుడో..
హైదరాబాద్, బెంగళూర్, ఢిల్లీ సహా మన మెట్రో నగరాల్లో ట్రాఫిక్‌లో చిక్కుకున్నామంటే ఇంటికి ఎప్పుడు చేరతామో తెలియని పరిస్ధితి. ఆఫీసులకు సమయానికి చేరాలన్నా, ఏదైనా పనిమీద అర్జంట్‌గా ఇంటికి వెళ్లాలన్నా..
హైదరాబాద్, బెంగళూర్, ఢిల్లీ సహా మన మెట్రో నగరాల్లో ట్రాఫిక్‌లో చిక్కుకున్నామంటే ఇంటికి ఎప్పుడు చేరతామో తెలియని పరిస్ధితి. ఆఫీసులకు సమయానికి చేరాలన్నా, ఏదైనా పనిమీద అర్జంట్‌గా ఇంటికి వెళ్లాలన్నా ఓ రెండు మూడు గంటలు ముందు బయలుదేరాల్సి ఉంటుంది. అయితే మిజోరాంలో దీనికి రివర్స్ సీన్ ఒకటి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఐజ్వాల్‌లో బారులుతీరిన వాహనాలు క్రమ పద్ధతిలో వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు ఐజ్వాల్ ఇండియన్ సైలెంట్ సిటీ అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు.మిజోరాంలోని ఐజ్వాల్ సిటీలో ఓ వీధిలోని ఇరుకైన రోడ్‌పైనే కార్లు, బైక్‌లు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళుతున్నాయి. కార్లు, బైక్‌లు వేర్వేర్లు లేన్స్‌పై క్యూ పద్ధతిలో చక్కగా ముందుకు పోతున్నాయి. ఏ వాహనం మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించకపోవడం ఇక్కడ విశేషం. ఐజ్వాల్‌లో వాహనదారులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఒకరినొకరు ఓవర్‌టేక్ చేసే ప్రయత్నం చేయరు. ప్రతిఒక్కరూ తమ వంతు వచ్చే వరకూ సహనంతో వేచిచూస్తారు..ఇండియాలోని ప్రతి నగరంలోనూ దీన్ని పాటించడం ఎంతో అవసరం అంటూ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. అద్భుతమైన ఈ వీడియోను 2 లక్షలమందికి పైగా వీక్షించారు. అదే సంఖ్యలో లైక్ చేస్తున్నారు. వీడియోపై పెద్ద సంఖ్యలో నెటిజన్లు స్పందిస్తున్నారు. ట్రాఫిక్ జామ్‌ను నివారించేందుకు భారతీయ నగరాలన్నీ ఈ ట్రాఫిక్ మోడల్‌ను అనుసరించాలని యూజర్లు కోరుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..