అడవి పంది అనుకుని వ్యక్తిపై కాల్పులు.. సీన్ కట్ చేస్తే
అడవి పందులను వేటాడేందుకు వెళ్లిన గ్రామస్థులు కొందరు అడవిలో జట్లుగా విడిపోయి తలో వైపు వెళ్లి వాటి కోసం వేట ప్రారంభించారు. చెట్ల గుబురులో అలికిడి వినిపించడంతో అక్కడ అడవి పంది ఉందని భావించి ఓ బృందం కాల్పులు జరిపింది. దీంతో మరో బృందంలోని 60 ఏళ్ళ వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
అంతటితో ఆగకుండా కాల్పుల్లో మరో వ్యక్తి కాలికి బులెట్ గాయమైంది. అయితే ఈ విషయాన్ని గ్రామస్థులు దాచిపెట్టడంతో ఘోరం జరిగిపోయింది. మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలోని ఓ గ్రామంలో సొంత బృందంలోని వారినే.. అడవి పందిగా పొరబడి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలో జనవరి 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు కొందరు ఒక బృందంగా ఏర్పడి మనోర్ జిల్లాలోని బోర్షెటీ అడవికి వెళ్లారు. అక్కడ జట్లుగా విడిపోయి తలో వైపు వెళ్లి అడవి పందుల కోసం వేట ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ గుంపునకు సమీపంలోని చెట్లగుబురులో అలికిడి వినిపించడంతో అడవి పందిగా భావించి కాల్పులు జరిపారు. దీంతో అటువైపున్న మరో బృందంలోని రమేశ్ వార్ధా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి అన్య మహాలోద కాలికి గాయమైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంవత్సరానికి ఒకసారి మాత్రమే పూసే ఈ పువ్వు మీ ఇంట ఉంటే..
TOP 9 ET News: రూ.100 కోట్ల దిశగా తండేల్..సాధించిన చైతూ | విశ్వక్ సేన్ కొంపముంచిన పృథ్వీ మేక డైలాగ్
రూ.8 లక్షలతో స్పోర్ట్స్ బైక్.. ఇండియాలోనే తొలి కొనుగోలుదారుడిగా హీరో రికార్డ్
విశ్వక్ కోసం ఎందుకు వెళుతున్నావని నన్ను ప్రశ్నించారు
Thandel: 3 రోజుల్లో రూ.62 కోట్లు.. బాక్సాఫీస్ దగ్గర తండేల్ దిమ్మతిరిగే వసూళ్లు