భార్యను చంపేశాడని భర్తపై వరకట్నం హత్య కేసు..రెండేళ్లకు చేతిలో బిడ్డతో కనిపించిన వివాహిత వీడియో
ఉత్తరప్రదేశ్ ఔరియా జిల్లాలో రెండేళ్ల క్రితం కనిపించకుండా పోయిన వివాహిత మధ్యప్రదేశ్‌లో సజీవంగా ఉన్నట్లు గుర్తించారు. ఆమె కనిపించకుండా పోవడంతో భర్త, అత్తింటివారిపై వరకట్న హత్య కేసు నమోదైంది. పోలీసుల దర్యాప్తులో ఆమె చేతిలో బిడ్డతో ఉన్నట్లు వెల్లడైంది. ఈ పరిణామం కేసు దర్యాప్తును ప్రభావితం చేయనుంది.
ఉత్తరప్రదేశ్ ఔరియా జిల్లాకు చెందిన 20 ఏళ్ల వివాహిత రెండేళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఘటనలో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. 2023లో, పెళ్లైన ఏడాదినర తర్వాత తన అత్తింటిలో ఉండగా ఆమె ఆచూకీ లేకుండా పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు అత్తింటివారే తమ కుమార్తెను అదనపు కట్నం కోసం హత్య చేశారని ఆరోపించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆమె భర్త, అత్తమామలతో పాటు మరో ఆరుగురిపై వరకట్న హత్య కేసు నమోదైంది.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
