వింత ఘటన.. గేదెకు ఒకే ఈతలో రెండు లేగ దూడలు

Updated on: Nov 14, 2025 | 3:46 PM

ఎన్టీఆర్ జిల్లాలోని గుడిమెట్ల గ్రామంలో ఓ గేదె అరుదైన రీతిలో ఒకే కాన్పులో రెండు దూడలకు జన్మనిచ్చింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో దూడల మనుగడ కష్టం. అయితే, ఈసారి తల్లి గేదెతో పాటు రెండు దూడలు ఆరోగ్యంగా ఉండటం విశేషం. ఈ అరుదైన సంఘటన స్థానికులను ఆశ్చర్యపరిచింది, పశువైద్యులు కూడా దీనిని అరుదైనదిగా పేర్కొన్నారు.

సాధారణంగా మనుషులకు కవల పిల్లలు పుట్టడం జరుగుతుంది. ఒకే కాన్పులో ముగ్గురు,నలుగురు పిల్లలు పుట్టిన ఘటనలూ చూశాం. కానీ ఎన్టీఆర్‌ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ గేదె ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు కృష్ణయ్య వ్యవసాయం చేసుకుంటూ పశువులను కూడా పెంచుతున్నారు. ఈ క్రమంలో ఆయన పశువుల కొట్టంలో గేదె మొదట ఒక లేగదూడకు జన్మనిచ్చింది. రైతు దానికి సపర్యలు చేసేలోపే మరో దూడను ఈనింది. అదిచూసి రైతు ఆశ్చర్యపోయాడు. వెంటనే పశువైద్యుడికి సమాచారిచ్చాడు. వైద్యుడు గేదెను, దూడలను పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పడంతో రైతు ఆనందం వ్యక్తం చేశాడు. ఒకే ఈతలో ఇలా రెండు దూడలు పుట్టడం చాలా అరుదైన విషయమని చెప్తున్నారు పశువైద్యులు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో దూడలు బతికి బయటపడటం కష్టమేనని, అయితే ఈసారి రెండు దూడలు, తల్లి గేదె కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. విషయం చుట్టుపక్కలవారికి తెలియడంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో కృష్ణయ్య ఇంటికి చేరుకుని ఆ అరుదైన దృశ్యాన్ని చూశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వివాహ వేదికపై పుష్-అప్‌లు ఇప్పుడిదో నయా ట్రెండ్‌

RBI: బంగారం కాకుండా ఈ లోహంతో లోన్ తీసుకోవచ్చా? ఎంత ఇస్తారు?

మీ పేరుతో ఇంకో సిమ్ యాక్టివేషన్.. తర్వాత విదేశాలకు అమ్మకం

Time Bank in Kerala: కేరళలో ‘టైమ్ బ్యాంక్‌’.. ఏం దాచుకుంటారంటే

65 ఏళ్లుగా నిద్రపోని రైతన్న.. ఆశ్చర్యపోతున్న వైద్యులు