Indians: ఆ లక్షలాది భారతీయులు.. అమెరికాను వదిలేయాల్సిందేనా.!

|

Jul 30, 2024 | 8:15 PM

చిన్నతనంలోనే తల్లిదండ్రులతో పాటు అమెరికా వెళ్లిన లక్షలాది మంది భారతీయులు.. ప్రస్తుతం అగ్రరాజ్యం నుంచి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. శాశ్వత నివాసార్హత, లేదా తాత్కాలిక వీసాలు రాక స్వదేశానికి తిరిగి రాక తప్పడం లేదు. అమెరికాలో ఇలాంటి వారిని డాక్యుమెంటెడ్ డ్రీమర్స్‌గా పిలుస్తారు. వీరి మొత్తం సంఖ్య 2.5 లక్షలకు పైనే ఉంటుంది. డాక్యుమెంటెడ్ డ్రీమర్స్‌లో భారతీయులే అత్యధికమని స్వయంగా వైట్‌ హౌస్ వర్గాలు తెలిపాయి.

అమెరికా నిబంధనల ప్రకారం, తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వచ్చే చిన్నారులను వీసాదారులపై ఆధారపడ్డ వారిగా పరిగణిస్తారు. 21 ఏళ్ల వరకూ వారు దేశంలో ఉండేందుకు అనుమతి ఉంటుంది. ఆలోపు గ్రీన్ కార్డు దక్కితే చట్టబద్ధంగా అగ్రరాజ్యంలో నివసించవచ్చు. లేకపోతే, నిబంధనల ప్రకారం వారిని గ్రీన్ కార్డు జాబితా నుంచి తొలగిస్తారు. దీన్ని ‘ఏజ్ ఔట్‌’గా పిలుస్తారు. ఆ తరువాత గ్రీన్ కార్డు లేదా వీసా కోసం సొంతంగా ప్రయత్నించాలి. ఇందులో విఫలమైతే స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలి. అమెరికాలో ప్రస్తుతం భారతీయులు వారి పిల్లలు సహా మొత్తం1.2 మిలియన్ల మంది వివిధ కేటగిరిల్లో దరఖాస్తు చేసుకుని గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు, కొందరు భారత సంతతి యువతీయువకులు ఇప్పటికే అమెరికాలోని తమ కుటుంబాలను వీడి భారత్‌లో బంధువుల వద్ద తలదాచుకుంటున్నారు.

డాక్యుమెంటెడ్ డ్రీమర్స్‌ సమస్య పరిష్కారానికి రిపబ్లికన్స్ చట్టసభల్లో మోకాలు అడ్డుతున్నారని వైట్ హౌస్ ఆరోపించింది. అన్ని వర్గాలకు అనుకూలమైన ఒప్పందాన్ని తాము రూపొందిస్తే రిపబ్లికన్లు రెండు సార్లు వ్యతిరేకంగా ఓటు వేశారని గుర్తు చేశారు. కాగా, గత నెలలో వివిధ పార్టీలకు చెందిన 43 మంది చట్టసభ సభ్యులు.. ఈ సమస్యకు పరిష్కారం కోరుతూ బైడెన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. గ్రీన్ కార్డుల కోసం కొందరు దశాబ్దాల తరబడి వేచి చూస్తున్నారని, సమస్యకు తక్షణ పరిష్కారం కోసం ప్రయత్నించాలని సూచించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.