కూతురి ఫీజు కోసం వెళ్లి.. యుద్ధంలో ముంబై ఇంజినీర్ మృతి

Updated on: Mar 16, 2026 | 6:10 PM

మెరైన్ ఇంజినీర్ దేవో నందన్ సింగ్ ఇరాక్ వద్ద ఇరాన్ సూసైడ్ బోట్ దాడిలో మృతి చెందారు. కుమార్తె మెడికల్ ఫీజుల కోసం చివరిసారిగా సముద్ర ప్రయాణం చేశారు. మంటల్లో చిక్కుకున్న నౌక నుండి చేసిన ఆఖరి ఫోన్ కాల్ కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది. అధికారిక సమాచారం లేకపోవడంతో, కుటుంబం అంతర్జాతీయ విచారణ డిమాండ్ చేస్తోంది. మధ్యప్రాచ్య యుద్ధం భారతీయ కుటుంబంలో నింపిన విషాదాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.

అతనో మెరైన్ ఇంజినీర్‌. అంతకు మించి ఓ మంచి తండ్రి. ఇటీవలే తన పదవికి రాజీనామా చేసారు. అయితే తన బిడ్డ మెడికల్ కాలేజీల ఫీజు కోసం చివరగా సముద్రప్రయాణానికి వెళ్లాడు. కానీ అక్కడే విధి వంచించి అతడు వెళ్తున్న నౌకపై ఇరాన్ సూసైడ్ బోట్ దాడి చేయగా.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే చనిపోవడానికి కాసేపటి ముందే.. మంటల్లో చిక్కుకున్న నౌక నుంచి ఆయన చేసిన ఆఖరి ఫోన్ కాల్ ఇప్పుడు ఆ కుటుంబ సభ్యుల గుండెల్ని పిండేస్తోంది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం ఒక భారతీయ మధ్యతరగతి కుటుంబంలో విషాదం నింపాయి. తన పదవికి రాజీనామా చేసినప్పటికీ.. కుమార్తె మెడికల్ కాలేజీ ఫీజు కోసం చివరసారిగా సముద్ర ప్రయాణానికి వెళ్లాడో ఇంజినీర్. అదే అతని పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా ఇరాక్ సమీపంలో జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. కుమార్తె జీవితం కోసం ఆయన చేసిన త్యాగం.. ఇప్పుడు ఆ కుటుంబాన్ని నిద్రపోనీయకుండా చేస్తోంది. ముంబైకి చెందిన 56 ఏళ్ల ఇంజినీర్ దేవో నందన్ ప్రసాద్ సింగ్.. సేఫ్‌సీ విష్ణు అనే ఆయిల్ ట్యాంకర్‌పై చీఫ్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అయితే బుధవారం ఆ నౌక ఇరాక్‌లోని జుబైర్ పోర్టుకు సమీపంలో ఉండగా భీకర దాడి జరిగింది. దాడిలో దేవో నందన్ ప్రాణాలు కోల్పోయారు. దాడి జరిగిన రోజు రాత్రి 2.36 గంటలకు ఆయన చివరిసారిగా తన కుటుంబానికి ఫోన్ చేశారు. షిప్‌లో మంటలు చెలరేగుతున్నాయి..” అని భయంతో చెప్పిన ఆ మాటలే ఆఖరి మాటలు అయ్యాయి. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఎన్ని సార్లు ఫోన్ చేసినా అవతలి నుంచి స్పందన లేదు. అయితే నాగ్‌పూర్ మెడికల్ కాలేజీలో చదువుతున్న ఆయన కుమార్తె కోమల్ సింగ్ మాట్లాడుతూ.. “నా కాలేజీ ఫీజులు పెండింగ్‌లో ఉన్నాయని.. ఆ డబ్బు కోసం నాన్న రిజైన్ చేసినా కూడా ఈ ఒక్క ట్రిప్ వెళ్తానన్నారు. ఇప్పుడు ఆయన లేరనే వార్తను మేం నమ్మలేకపోతున్నాం” అంటూ కన్నీరుమున్నీరు అయ్యారు. తమకు కంపెనీ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని సింగ్ భార్య ఆరోపించారు. మొదట అందరూ సురక్షితంగా ఉన్నారని చెప్పిన షిప్పింగ్ కంపెనీ.. తీరిగ్గా ఆయన మరణించారని చెప్పడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సముద్రపు నీటిని ఎక్కువగా పీల్చుకోవడం వల్లే ఆయన చనిపోయారని కంపెనీ చెబుతున్నప్పటికీ.. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో విచారణ జరపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు యుద్ధం లేని ప్రాంతంలో కూడా పౌర నౌకలపై దాడులు ఎలా జరుగుతున్నాయో ప్రపంచ దేశాలు నిలదీయాలని దేవో నందన్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అమెరికాలో మేనేజ్‌మెంట్ కోర్సు చేస్తున్న ఆయన కుమారుడు తండ్రి మరణవార్త విని హుటాహుటిన భారత్‌కు బయలుదేరారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రవాసుడి డ్యాన్స్ వైరల్.. యూఎస్ వీసా రద్దయ్యే ఛాన్స్ ??

ఉదయాన్నే ఓ గ్లాసు ఇది తాగండి చాలు.. అద్భుత ప్రయోజనాలు మీ సొంతం

Simhachalam: సింహాచలంలో ‘డిజిటల్’ దర్శనం: క్యూలైన్లకు చెక్..

తండ్రి డ్రైవర్‌.. కొడుకు కండక్టర్‌.. ఒకే బస్సులో విధులు

గ్యాస్ సంక్షోభంపై తమిళ సర్కార్ ‘మాస్టర్ ప్లాన్’

Follow Us