రెస్టారెంట్‌లో రూ. 23 వేల బిల్లు ఎగ్గొట్టి పరార్‌

Updated on: Aug 17, 2025 | 2:55 PM

రెస్టరంట్‌లో కడుపునిండా తిని.. కొందరు యువకులు బిల్లు చెల్లించకుండా పరారయ్యారు. ఈ ఘటన యూకే లోని ఓ భారతీయ రెస్టరంట్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. నార్తాంప్టన్‌లోని ఓ భారతీయ రెస్టరంట్‌కు కొందరు యువకులు వెళ్లారు. భోజనం ఆర్డర్‌ పెట్టుకుని కడుపునిండా తిన్నారు.

ఆ తర్వాత బిల్లు చెల్లించకుండా అక్కడి నుంచి పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు సిబ్బంది ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. దాదాపు 23 వేల రూపాయల బిల్లు ఎగ్గొట్టినట్లు రెస్టరంట్‌ నిర్వాహకులు ఓ పోస్టులో తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. యువకులను పట్టుకునేందుకు సాయం చేయాలని అక్కడి ప్రజలను కోరారు. మిగిలిన వ్యాపారస్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువకులను గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఆ యువకులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్లు కట్టలేనప్పుడు రెస్టరంట్‌కు వచ్చి ఉండకూడదని కామెంట్లు పెట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ. 80 కోట్ల ఆస్తి .. చివరి చూపుకు రాని పిల్లలు

మటన్ సూప్.. అదిరిపోద్ది.. హీరో ఎవరంటే

పవిత్ర స్థలంలో అలాంటి పనులేంటి ?? వివాదంలో జాన్వీ, సిద్ధార్థ్‌

170 కోట్లు ఏంటి సామి..! కలెక్షన్స్‌ సునామీ అంటే ఇదీ..

Samantha: అమ్మాయిలు అలర్ట్! తన స్కిన్‌ కేర్‌ సీక్రెట్ బయటపెట్టిన సామ్