ఆ హనుమాన్ ఆలయంలో ఆ ఒక్క రోజు పొంగళ్ల నైవేద్యం వెనుక కథ ఇదే

|

Jan 10, 2024 | 9:19 PM

ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు ఆటలతో సంక్రాంతి సందడి మొదలైంది. అంతేకాదు అనేక ఆలయాల్లో జాతరలు కూడా జరుగుతున్నాయి. సంక్రాంతి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కడప జిల్లాలోని సంజీవరాయ స్వామి ఆలయంలో పొంగళ్ల వేడుకను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రతీ ఏడాది సంక్రాంతికి ముందు ఆదివారం ఇక్కడ మగవారు పొంగళ్ళు సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో మహిళలకు ప్రవేశం నిషిద్ధం.

ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు ఆటలతో సంక్రాంతి సందడి మొదలైంది. అంతేకాదు అనేక ఆలయాల్లో జాతరలు కూడా జరుగుతున్నాయి. సంక్రాంతి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కడప జిల్లాలోని సంజీవరాయ స్వామి ఆలయంలో పొంగళ్ల వేడుకను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రతీ ఏడాది సంక్రాంతికి ముందు ఆదివారం ఇక్కడ మగవారు పొంగళ్ళు సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో మహిళలకు ప్రవేశం నిషిద్ధం. పైగా స్వామివారి నైవేద్యం కూడా వారు తినకూడదు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లెలో సంజీవరాయ స్వామి పొంగల్లు వేడుక చాలా ఫేమస్. ఈ గ్రామస్తులు వృత్తి రీత్యా దేశవిదేశాల్లో స్థిరపడినా… ఈ వేడుక కోసం అన్ని పనులనూ పక్కనబెట్టి.. ఇక్కడికి వస్తారు. ఆ కుటుంబాల్లోని మగవారు స్థానికులతో కలిసి పొంగళ్లను సమర్పించి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ ఆంజనేయస్వామిని సంజీవరాయ స్వామిగా భక్తులు పూజిస్తారు. సంజీవరాయ స్వామికి మగవారు మాత్రమే పొంగళ్ళు సమర్పించడం ఇక్కడ ప్రతేకత.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫోన్లు అతిగా వాడొద్దంటూ షరతు !! ఫ్యామిలీతో బాండ్‌ రాయించుకున్న మహిళ !!

జూలో సందడి చేస్తున్న తెల్లపులి పిల్లలు

నడుస్తున్న రైల్లో చలిమంట వేసుకున్న ప్రయాణికులు !! పొగలు రావడంతో ??

Follow us on