17 ఏళ్ల కెరీర్‌లో 100కు పైగా ఆపరేషన్లు.. మావోయిస్టులకు సింగం ఎన్‌కౌంటర్ల ‘లక్ష్మణ్‌’

|

Apr 19, 2024 | 8:00 PM

బస్తర్‌లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్‌ ఆపరేషన్‌కు ఓ ఇన్‌స్పెక్టర్‌ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌..! మావోయిస్టుల సింగంగా ఆయనకు పేరుంది. ఆయనే ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణ్‌ కేవట్‌ ఈ పేరు చెబితే మావోయిస్టులకు గుండె దడదడలాడుతుంది. 17 ఏళ్ల కెరీర్‌లో దండకారణ్యాన్ని జల్లెడ పడుతూ బెదిరింపులను లెక్కచేయకుండా మావోయిస్టులను ఏరిపారేస్తున్నారు. ఇప్పటి వరకు 100కు పైగా ఆపరేషన్లలో పాల్గొన్నారు.

బస్తర్‌లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్‌ ఆపరేషన్‌కు ఓ ఇన్‌స్పెక్టర్‌ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌..! మావోయిస్టుల సింగంగా ఆయనకు పేరుంది. ఆయనే ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణ్‌ కేవట్‌ ఈ పేరు చెబితే మావోయిస్టులకు గుండె దడదడలాడుతుంది. 17 ఏళ్ల కెరీర్‌లో దండకారణ్యాన్ని జల్లెడ పడుతూ బెదిరింపులను లెక్కచేయకుండా మావోయిస్టులను ఏరిపారేస్తున్నారు. ఇప్పటి వరకు 100కు పైగా ఆపరేషన్లలో పాల్గొన్నారు. ఫలితంగా ‘ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా మారారు. మంగళవారం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కాంకేర్‌ జిల్లాలో జరిగిన భారీ ఆపరేషన్‌కు ఆయనే మాస్టర్‌ మైండ్‌..! కాల్పుల సమయంలో భద్రతా బలగాలకు ఎదురైన సవాళ్లని మీడియాకు తెలిపారు. కొటారీ నదికి అవతలివైపు ఉండే కొండ ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో సమావేశమైనట్లు సమాచారం రాగానే తాము ఆపరేషన్‌కు సిద్ధమైనట్లు చెప్పారు. అయితే అక్కడకు వెళ్లడం సవాళ్లతో కూడుకున్న పని అనీ ఉక్కపోత, కొండలు, తాగునీటి కొరత.. ఇవన్నీ దాటుకుని 200 మంది భద్రతా సిబ్బందితో అక్కడకు చేరుకున్నట్లు లక్ష్మణ్‌ తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Shikhar Dhawan: నువ్వు ఎప్ప‌టికీ నాతోనే ఉంటావు.. శిఖ‌ర్ ధావ‌న్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌

Follow us on