విరాట్‌ కోహ్లీ కొడుకు పేరు ‘అకాయ్’ అంటే అర్థం ఏంటో తెలుసా ??

|

Feb 23, 2024 | 7:21 PM

రెండోసారి తల్లిదండ్రులైన సెలబ్రిటీ జంట విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మ తమ బిడ్డకు అకాయ్‌గా నామకరణం చేశారు. ఈ పేరుకు అర్థం ఏంటని నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. దీనిపై ఆ రంగంలో నిపుణులు రెండు రకాల అర్థాలను చెబుతున్నారు. సంస్కృతంలో ఈ పదానికి అమరుడు, చిరంజీవుడు అనే అర్థం ఉందని వెల్లడించారు. అలాగే హిందీలో కాయ్‌ అంటే శరీరమని.. అకాయ్‌ అంటే భౌతిక శరీరానికి మించినవాడు అని వివరించారు.

రెండోసారి తల్లిదండ్రులైన సెలబ్రిటీ జంట విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మ తమ బిడ్డకు అకాయ్‌గా నామకరణం చేశారు. ఈ పేరుకు అర్థం ఏంటని నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. దీనిపై ఆ రంగంలో నిపుణులు రెండు రకాల అర్థాలను చెబుతున్నారు. సంస్కృతంలో ఈ పదానికి అమరుడు, చిరంజీవుడు అనే అర్థం ఉందని వెల్లడించారు. అలాగే హిందీలో కాయ్‌ అంటే శరీరమని.. అకాయ్‌ అంటే భౌతిక శరీరానికి మించినవాడు అని వివరించారు. మరోవైపు టర్కీ భాషలో ఈ పదానికి ప్రకాశిస్తున్న చంద్రుడు అనే అర్థం కూడా ఉందట. మరి విరుష్క జంట ఏ అర్థంలో తమ బిడ్డకు అకాయ్‌గా నామకరణం చేశారో అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఈ నెల 15న అనుష్క మగబిడ్డకు జన్మనిచ్చిందని కోహ్లి మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో తెలిపాడు. వీరికి ఇప్పటికే మూడేళ్ల కుమార్తె వామిక ఉంది. ఫిబ్రవరి 15న మా బాబు, వామిక తమ్ముడు అకాయ్‌ని ఈ ప్రపంచంలోకి ఆహ్వానించాం. ఈ విషయం అందరికీ చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఈ అందమైన సమయంలో మీ ఆశీర్వాదాలు కావాలి. మా ఏకాంతాన్ని గౌరవించమని విజ్ఞప్తి చేస్తున్నాం అని కోహ్లి చెప్పాడు. ఈ జంటకు ప్రముఖులు, అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా కోహ్లి వ్యక్తిగత కారణాలతో భారత్‌-ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌కు దూరమయ్యారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జయలలిత నగలు తీసుకెళ్లండి.. 6 ట్రంకు పెట్టెలతో రండి

షోయబ్ మాలిక్ మూడో భార్య సనా జావెద్ కు చేదు అనుభవం

17 సార్లు లేని గర్భంతో నటన.. 98 లక్షలు హాం ఫట్