Sugarcane Plantation: పైకి చెరకు తోటే.. లోపల యవ్వారం మాములుగా లేదుగా.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్…

|

Jul 13, 2022 | 8:24 AM

గంజాయి ఇప్పుడు యువత పాలిట పెను ప్రమాదంగా మారింది. మత్తుకు అలవాటు పడి బంగారం లాంటి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు కొందరు. దీంతో ప్రభుత్వాలు గంజాయి సహా ఇతర డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నాయి.


గంజాయి ఇప్పుడు యువత పాలిట పెను ప్రమాదంగా మారింది. మత్తుకు అలవాటు పడి బంగారం లాంటి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు కొందరు. దీంతో ప్రభుత్వాలు గంజాయి సహా ఇతర డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నాయి. డ్రగ్స్ నియంత్రణ, నిషేధం కోసం ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేశాయి. అయితే గంజాయి పండించేవారు, రవాణా చేసేవారు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. కొన్నిసార్లు జైలుకు వెళ్లినా తిరిగి వచ్చాక షరామామూలే.. దేశవ్యాప్తంగా రోజూ ఈ మాయదారి మత్తు పట్టుబడుతున్న అనేక ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా కర్ణాటకలోని గోకాక్ తాలూకాలోని హోనకుప్పి గ్రామంలో చెరకు పంటల మధ్య గంజాయి మొక్కలను సాగుచేస్తున్న తండ్రీకొడుకులను కుల్గోడ్ పోలీసులు (Kulgod police) జూలై 7న అరెస్టు చేశారు. నిందితులు బసప్ప రంగప్ప లగాడి, అతని కుమారుడు సిద్దప్పగా గుర్తించారు. వీళ్లు చెరుకు తోటలో సీక్రెట్‌గా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి ఇద్దరిని పట్టుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?