చనిపోయాడనుకున్నారు.. 28 ఏళ్ళ తర్వాత తిరిగొచ్చాడు వీడియో
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాకు చెందిన షరీఫ్ 28 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగివచ్చారు. చనిపోయాడని భావించిన ఆయనను చూసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. SIRకు సంబంధించిన పత్రాల పని నిమిత్తం ఖతౌలీకి చేరుకున్న షరీఫ్ రాకతో ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది.
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. దాదాపు 30 ఏళ్ల కిందట చనిపోయాడని భావించిన ఖతౌలీకి చెందిన షరీఫ్, ఇప్పుడు అనుకోకుండా తన ఇంటికి తిరిగివచ్చారు. షరీఫ్ మళ్లీ ప్రత్యక్షం అవ్వడంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగుపొరుగు వారు తీవ్ర షాక్‌కు గురయ్యారు. అయితే, ఈ ఆశ్చర్యం వెంటనే ఆనందంగా మారింది. షరీఫ్ మొదటి భార్య 1997లో మరణించిన తర్వాత, అతను మళ్లీ పెళ్లి చేసుకుని తన రెండవ భార్యతో కలిసి పశ్చిమ బెంగాల్‌కు వెళ్లారు. కొంతకాలం పాటు ల్యాండ్‌లైన్ ఫోన్‌ల ద్వారా కుటుంబంతో సంప్రదింపులు జరిపినప్పటికీ, ఆ తర్వాత కమ్యూనికేషన్ పూర్తిగా నిలిచిపోయింది.
మరిన్ని వీడియోల కోసం :
