బైక్‌పై దూసుకెళ్తుంటే వింత శబ్ధాలు.. బండి ఆపి చూడగా షాక్

|

Jun 04, 2023 | 10:02 AM

చెట్టులోనూ, పుట్టలోనూ ఉండాల్సిన పాములు దారి తప్పుతున్నాయి. అప్పుడప్పుడు ఇళ్లలోకి వచ్చేసి హడలెత్తిస్తుంటాయి. కానీ ఓ వ్యక్తి బైకులోకి ఏకంగా రెండు పాములు దూరాయి. పార్క్ చేసిన బండికి కీ పెట్టి స్టార్ట్ చేసి రయ్ మని వెలుతుంటే.. ఏదో తన కాలికి చుట్టుకున్నట్టు బైకర్ హడలిపోయాడు.

చెట్టులోనూ, పుట్టలోనూ ఉండాల్సిన పాములు దారి తప్పుతున్నాయి. అప్పుడప్పుడు ఇళ్లలోకి వచ్చేసి హడలెత్తిస్తుంటాయి. కానీ ఓ వ్యక్తి బైకులోకి ఏకంగా రెండు పాములు దూరాయి. పార్క్ చేసిన బండికి కీ పెట్టి స్టార్ట్ చేసి రయ్ మని వెలుతుంటే.. ఏదో తన కాలికి చుట్టుకున్నట్టు బైకర్ హడలిపోయాడు. భయంతో బండిని నడిరోడ్డుపైనే వదిలేశాడు. ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిందీ ఘటన. డ్రైవర్‌గా పనిచేసే సతీష్ గాంధీ బొమ్మ సెంటర్‌లో ఓ మెకానిక్ షెడ్ వద్ద తన బైక్‌ను పార్క్ చేశాడు. కొంచెం సేపటి తర్వాత పని పూర్తి చేసుకుని సతీష్ తన బైక్ తీసుకుని వెలుతుండగా.. ఓ పాము తన బైక్‌లో నుంచి వచ్చి సతీష్ కాళ్లకు చుట్టుకుంది. దీంతో సతీష్ బైక్ వదిలి భయంతో అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఆ పాము మెల్లగా అక్కడి నుంచి జారుకుంది. పాము వెళ్లిపోయిందని బైక్ వద్దకు వచ్చి చూస్తే షాక్.. మళ్లీ పాము బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది. తీరా పరిశీలిస్తే.. బైక్ సీట్ కింద మరో పాము కనిపించింది. అక్కడికి చేరుకున్న స్థానికులు చాకచక్యంగా బైక్ సీట్ కింద దాగిన పామును తొలగించి బయటకు తీశారు. దాంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫుల్‌టైమ్‌ కూతురిగా జాబ్‌ ఆఫర్.. నెలకు జీతం ఎంతంటే ??

శుభమా అని పెళ్లి చేసుకుంటే.. ఇదేంట్రా బాబూ

3నెలల శిశువును ముద్దాడేందుకు యత్నించిన ఒరంగుటాన్.. హృదయాలను కట్టిపడేస్తున్న వీడియో

శవంపై కూర్చొని అఘోరా పూజలు.. తమిళనాడులో కలకలం సృష్టించిన ఘటన

Chiranjeevi: నాకు క్యాన్సర్ రాలేదు.. తప్పుగా అర్థం చేసుకున్నారు..