ఓరి దేవుడో.. ఇదేం వెరైటీ ఫుడ్‌! కోక్‌ తో ఆమ్లెట్టా ?? ఎలా చేశాడంటే..

Updated on: Jan 20, 2025 | 5:13 PM

భోజనప్రియులందరికీ ఆమ్లెట్ ఇష్టమైనదే కావడంతో చాలా మంది చాలా రకాలుగా తయారు చేస్తుంటారు. కొందరు ఆమ్లెట్‌కు వెన్న యాడ్‌ చేస్తారు. మరి కొందరు నెయ్యి, ఇతర కూరగాయలు వేసి తయారు చేస్తుంటారు. ఇకపోతే, మార్కెట్లో ఎన్నో రకాల ఆమ్లెట్‌ లభిస్తుంటుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి తయారు చేసిన ఆమ్లెట్‌ చూసిన గుడ్డు ప్రియులు గుర్రుమంటున్నారు.

ఇదేం ఆమ్లెట్‌రా బాబు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అతడు కోక్‌ కూల్‌డ్రింక్‌తో ఆమ్లెట్‌ తయారు చేశాడు. వైరల్ వీడియోలో ఏముందంటే.. ఆ వ్యక్తి ముందుగా పాన్‌ని వేడి చేసి, ఆ తర్వాత అందులో ఒక డబ్బా నుండి కోక్ పోశాడు. అందులోనే రెండు గుడ్లు కొట్టిపోశాడు. ఆ తర్వాత పాన్‌లో మిరపకాయలు, ఉల్లిపాయలు వేసి బాగా కలిపాడు. ఉల్లిపాయలతో పాటు ఇతర పదార్థాలను కూడా వేశాడు. కాసేపు వాటిని వేయించిన తర్వాత, గుడ్డు బుర్జిలా తయారు చేశాడు. అందులో ఉప్పు, ఇతర మసాలాలు కూడా కలిపాడు. డిష్‌ రెడీ అయిన తరువాత.. వడ్డించే ముందు, దానిపైన టమాటా సాస్‌ కూడా యాడ్‌ చేశాడు. వైరల్ వీడియోలో ఏముందంటే.. ఆ వ్యక్తి ముందుగా పాన్‌ని వేడి చేసి, ఆ తర్వాత అందులో ఒక డబ్బా నుండి కోక్ పోశాడు. అందులోనే రెండు గుడ్లు కొట్టిపోశాడు. ఆ తర్వాత పాన్‌లో మిరపకాయలు, ఉల్లిపాయలు వేసి బాగా కలిపాడు. ఉల్లిపాయలతో పాటు ఇతర పదార్థాలను కూడా వేశాడు. కాసేపు వాటిని వేయించిన తర్వాత, గుడ్డు బుర్జిలా తయారు చేశాడు. అందులో ఉప్పు, ఇతర మసాలాలు కూడా కలిపాడు. డిష్‌ రెడీ అయిన తరువాత.. వడ్డించే ముందు, దానిపైన టమాటా సాస్‌ కూడా యాడ్‌ చేశాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ హీరోను ప్రేమించి.. కెరీర్ పాడు చేసుకున్న హీరోయిన్..