Viral Video: 18 గంటల ఓపికకు బంపర్‌ ఆఫర్‌.! ఒక్కడి కోసం విమానం నడిపారు..

|

Jul 02, 2023 | 9:29 AM

విమానం బయలుదేరడం ఆలస్యమవడంతో ఒక ప్రయాణికుడికి బంపర్‌ ఆఫర్‌ దొరికింది. ఉచిత పాస్‌తో పాటు ఫస్ట్‌క్లాస్‌లో ఒంటరిగా ప్రయాణించే ఛాన్స్‌ సొంతం చేసుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. అమెరికా నుంచి నార్త్‌ కరోలినాకు వెళ్లే విమానం.. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది.

విమానం బయలుదేరడం ఆలస్యమవడంతో ఒక ప్రయాణికుడికి బంపర్‌ ఆఫర్‌ దొరికింది. ఉచిత పాస్‌తో పాటు ఫస్ట్‌క్లాస్‌లో ఒంటరిగా ప్రయాణించే ఛాన్స్‌ సొంతం చేసుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. అమెరికా నుంచి నార్త్‌ కరోలినాకు వెళ్లే విమానం.. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. విమానం టేకాఫ్‌ కావడానికి 18 గంటలు పడుతుందని తేలడంతో అంతసేపు వెయిట్‌ చేయలేని ప్రయాణికులు ప్రత్యామ్నాయం చూసుకున్నారు. దీని వల్ల విమానం అంతా ఖాళీ అయ్యింది. ఫిల్‌ స్ట్రింగర్‌ అనే వ్యక్తి మాత్రం వెళ్లకుండా అక్కడే ఉండిపోయాడు. దీంతో అతడికి ఉచిత పాస్‌తో పాటు ఫస్ట్‌క్లాస్‌లో ప్రయాణించే అవకాశాన్ని సంస్థ కల్పించింది. ఫిల్‌ విమానంలో తన ప్రయాణ అనుభవాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసాడు.

‘‘ గేటు దగ్గరికి వెళ్లే సరికి ప్రయాణికులెవరూ కనిపించలేదు. అందరినీ లోపలికి పంపేశారా.. అని అక్కడున్న సిబ్బందిని అడిగాను. ఈ రోజు మీరు మాత్రమే ప్రయాణించనున్నారు అన్నారు. ఆటపట్టిస్తున్నారని అనుకున్నాను.. ‘అమెరికా ఎయిర్స్‌’ నా ఒక్కడి కోసం విమానాన్ని టేకాఫ్‌ చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. కానీ సిబ్బంది నన్ను నవ్వించే ప్రయత్నం చేశారు. వారితో కలిసి పార్టీని ఎంజాయ్‌ చేశా. ఎవరూ 18 గంటల పాటు వేచి చూడడానికి ఇష్టపడరు. జీవితంలో మరుపురాని రోజుగా ఇది మిగిలిపోతుంది’ అని రాసుకొచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..