Loading video

ఇదికదా టెక్నాలజీ అంటే.. అతని తెలివికి హ్యాట్సాఫ్‌ వీడియో

|

Mar 17, 2025 | 6:49 AM

టెక్నాలజీ యుగంలో ఇంటర్నెట్‌ అందరికీ అందుబాటులోకి వచ్చింది. దీంతో ప్రపంచం నలుమూలల్లో ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా క్షణాల్లో ప్రజలను చేరుతుంది. ఒక్క మొబైల్ దేశాన్ని అరచేతిలో చూపిస్తోంది. తాజాగా ఓ వ్యక్తి టెక్నాలజీని ఉపయోగించి రైతులకు ఉపయోగపడే ఓ పరికరాన్ని తయారు చేశాడు. ఇలాంటి జుగాడ్‌లు తయారుచేయడం భారతీయులకే సాధ్యం. నిజానికి వీరు ఎలాంటి డిగ్రీలు లేని శాస్త్రవేత్తలు అని చెప్పవచ్చు.

 కొందరు వ్యక్తులు తమ తెలివి తేటలు ఉపయోగించి చేసే పనులు చాలా మందిని బాగా ఆకర్షిస్తుంటాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. గ్రామాల్లో రైతులు పశువులు దానా కోసం గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి ఇతర పదార్ధాలతో కలిపి పశువులకు ఆహారంగా పెడతారు. ఈ గడ్డిని వారు ఎంతో శ్రమకోర్చి కత్తితో చిన్న చిన్న ముక్కలుగా నరుకుతారు. వీరి శ్రమను తగ్గించేందుకు ఓ వ్యక్తి చేసిన ఉపాయం అందరినీ ఆకట్టుకుంటోంది. అతను ఏం చేశాడంటే.. పదునైన బ్లేడ్లు కలిగిన ఓ చక్రాన్ని తీసుకొని, దానిని ఒక టైరులో అమర్చాడు. ఆ టైరు లో కొంత భాగాన్ని కట్‌చేసి చక్రాన్ని అమర్చాడు. ఇప్పుడు ఈ చక్రానికి ఒక మోటారు అమర్చాడు. దీనిని ఒక స్టాండ్‌ పైన అమర్చి,ఈ పెద్ద చక్రానికి ఆపోజిట్‌లో మరో చిన్న చక్రాన్ని ఏర్పాటు చేశాడు. ఈ రెండిటినీ కలుపుతూ ఓ బెల్ట్‌ అమర్చాడు. అలా ఓ కట్టర్‌ని తయారు చేశాడు. స్విచ్ వేయగానే చక్రం తిరుగుతోంది.

మరిన్ని వీడియోల కోసం :

గుడ్డును మింగిన పాము.. కక్కలేక మింగలేక…చివరికి.. వీడియో

రాజకీయాల నుంచి సినిమాల్లోకి జగ్గారెడ్డి వీడియో

సెల్‌ఫోన్‌ ఎఫెక్ట్‌.. ఆ తల్లి చేసిన నిర్వాకం చూస్తే.. వీడియో

చిరంజీవి, పవన్ కల్యాణ్‌కు నాగబాబు ఎంత అప్పు ఉన్నారో తెలుసా..?