టైర్ పంక్చర్ మోసంపై అలర్ట్! అదేంటంటే

Updated on: Aug 12, 2025 | 8:27 PM

పెట్రోల్ బంకుల్లో స్కామ్‌లు అనగానే.. తక్కువ పెట్రోల్ పోయడం వంటివి చూసాం. ఇప్పుడు ఓ కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. దీని గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. పెట్రోల్ బంక్‌లు అందించే సేవల్లో ఒకటి టైర్‌లో ఫ్రీగా గాలి నింపడం. మరి కొన్ని చోట్ల టైర్ పంక్చర్ రిపేర్ కూడా చేస్తారు. వాహనదారులను లక్ష్యంగా చేసుకుని, స్కామర్‌లు కొత్త రకం మోసాలు చేస్తున్నారు.

హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌కు చెందిన ప్రణయ్ కపూర్ కారులో వెళ్తుండగా.. కారు డాష్‌బోర్డ్‌లో టైర్ ఫ్లాట్ అయినట్లు వార్నింగ్ లైట్ గమనించాడు. సమీపంలోని పెట్రోల్ బంకుకు వెళ్లాడు. అక్కడి సిబ్బంది నిజంగా ఫ్లాట్ అయిందని నిర్ధారించారు. అయితే, టైర్‌ను పూర్తిగా తనిఖీ చేయడానికి దానిని తొలగించాలని చెప్పారు. సరేనని ప్రణయ్ చెప్పడంతో కారు నుంచి టైర్‌ను తొలగించి, సబ్బు నీళ్లతో చెక్ చేయగా, టైరులో ఒక స్క్రూ కనిపించింది దాన్ని తొలిగించారు. కానీ తర్వాత మరో నాలుగు చోట్ల పంక్చర్లు ఉన్నాయని, ప్రతి పంక్చర్‌కు ‘మష్రూమ్ పాచ్’ అవసరమని, ఒక్కో ప్యాచ్‌కు రూ.300 చొప్పున, మొత్తం నాలుగు ప్యాచ్‌లకు రూ.1,200 అవుతుందని చెప్పాడు. ప్రణయ్‌కు అనుమానం రావటంతో మరో టైరు రిపేర్ షాపుకు వెళ్లాడు. అక్కడి టెక్నీషియన్ టైర్‌ను తనిఖీ చేసి, కేవలం ఒక్క పంక్చర్ మాత్రమే జరిగిందని, మిగిలినవి కావాలని పెట్రోల్ బంకు వర్కర్ బిల్లు పెంచడానికి ఉద్దేశపూర్వకంగా సృష్టించినవని చెప్పటంతో షాకయ్యాడు. స్క్రూ తొలగించే సమయంలో వారు పదునైన పరికరం ఉపయోగించి ఇలా చేస్తారని చెప్పాడు. ఈ విషయాన్ని ప్రణయ్ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసాడు. పెట్రోల్ బంకు సిబ్బంది చేసిన మోసానికి తన కారు టైరును మార్చుకోవాల్సి వచ్చిందని, అందుకు రూ.8000 ఖర్చు అయిందని వివరించాడు. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా కావటంతో పలువురు నెటిజన్లు తమకు అలాంటి అనుభవమే ఎదురైందని కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాగబంధనం వేసిన గ‌దిని తెరిచేది ఎప్పుడు? అనంత ప‌ద్మ‌నాభ‌ ఆలయ గది రహస్యం ఏంటి!

అతిగా ఉప్పు తీసుకుంటున్నారా? హార్ట్ ఎటాక్ ముప్పు తప్పదా

దేవుడ్ని మొక్కేందుకు వెళ్లిన భక్తులకు ఊహించని షాక్

ముఖ్యమంత్రి పేరును మర్చిపోయా క్షమించండి..

అభిమాని మూగ అభిమానం.. కరిగిపోయి కోరిక తీర్చిన NTR