Ironing clothes: వయమ్మో..! ఇతను బట్టలు ఐరన్‌ చేయడం చూస్తే.. మళ్లీ లాండ్రీకి బట్టలివ్వరు..

|

Jul 11, 2022 | 8:46 PM

సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఎక్కడ ఏ విషయం జరిగినా వెంటనే ఆన్ లైన్ లో ప్రత్యక్షమవుతుంది. ఇప్పటికే తినే ఆహారంలో, తాగే నీటిలో ఉమ్మి వేస్తూ..


సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఎక్కడ ఏ విషయం జరిగినా వెంటనే ఆన్ లైన్ లో ప్రత్యక్షమవుతుంది. ఇప్పటికే తినే ఆహారంలో, తాగే నీటిలో ఉమ్మి వేస్తూ.. కస్టమర్స్‌కు అమ్ముతున్న వీడియోలు చాలా నెట్టింట్లో హల్ చల్ చేశాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు లాండ్రీకి బట్టలు ఇవ్వాలంటే భయమేస్తుంది అంటున్నారు. అసలేం జరిగిందంటే..వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి బట్టలు ఐరన్‌ చేస్తున్నాడు. సాధారణంగా బట్టలు మరీ నలిగిపోతే ఆ ముడుతలు పోడానికి నీళ్లు చల్లి ఇస్త్రీ చేస్తారు. అందుకు చేతితో లేదా స్ప్రే బాటిల్ ఉపయోగించి నీళ్లు చల్లుతారు. కానీ ఈ వ్యక్తి చేతికి బదులు నోటిని వాడుతున్నాడు. నోటితో బట్టలపై నీళ్లు ఉమ్ముతూ ఇస్త్రీ చేస్తున్నాడు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. దాంతో ఇది వైరల్‌గా మారింది. ఈ వీడియోను 16 లక్షలమందికి పైగా వీక్షించారు. వేలల్లో లైక్‌ చేస్తూ.. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?