Viral Video: ఆలయంలో బీభత్సం సృష్టించిన గజరాజు.. దాని నుంచి ఎలా తప్పుంచుకున్నారో చూడండి

|

Sep 25, 2021 | 5:07 PM

ఓ ఏనుగు బీభత్సం సృష్టించిన ఘటన కేరళలోని తిరువిల్వామల విల్వద్రినాథ గుడిలో జరిగింది. ఓ వ్యక్తి ఏనుగుపై నుంచి కింద పడి గాయాల పాలయ్యారు. అతను ఏనుగు దాడి నుంచి తప్పించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది.

Viral Video: ఆలయంలో బీభత్సం సృష్టించిన గజరాజు.. దాని నుంచి ఎలా తప్పుంచుకున్నారో చూడండి
Man Falls Off Elephant At Thiruvilwamala Vilwadrinatha Temple In Kerala
Follow us on

ఓ ఏనుగు బీభత్సం సృష్టించిన ఘటన కేరళలోని తిరువిల్వామల విల్వద్రినాథ గుడిలో జరిగింది. ఓ వ్యక్తి ఏనుగుపై నుంచి కింద పడి గాయాల పాలయ్యారు. అతను ఏనుగు దాడి నుంచి తప్పించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది.

గుడికి చెందిన అదత్తు పరమ్ అక పానచెరి పరమేశ్వరం అనే ఏనుగు ఒకేసారి తన శరీరాన్ని విదిల్చుతూ, బీభత్సం సృష్టించింది. ఆ సమయంలో గుడి సిబ్బంది కునిసెరి స్వామినాథన్ ఏనుగుపై ఉన్నారు. ఏనుగు చేష్టలతో ఆయన కింద పడ్డారు. కింద పడిన అతనిపై ఏనుగు దాడి చేయడానికి ప్రయత్నించింది. స్వామినాథన్ దాని నుంచి తప్పించుకున్నారు. స్వామినాథన్‎కు చిన్నపాటి గాయాలయ్యాయి. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. గుడిలో కజ్జా సీవేలి’ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రతి రోజు ప్రర్థనల్లో భాగంగా ఏనుగును అక్కడికి తీసుకొచ్చారు. గంట పాటు బీభత్సం సృష్టించిన ఏనుగును అదుపులోకి తెచ్చిన అటవీ శాఖ అధికారులు దానిని తీసుకెళ్లారు. ఏనుగు దీప స్తంభాలను కూడా ధ్వంసం చేసింది.

మరిన్ని చదవండి ఇక్కడ : Super Robo Video: సూపర్‌ రోబోను కనిపెట్టిన అఫ్గానిస్తాన్‌ యువతులు..!(వీడియో)

 Megastar Chiranjeevi: ఈరోజు నాకు చాలా స్పెషల్ డే..!గతాన్ని గుర్తు చేసుకొని మురిసిపోయిన మెగాస్టార్…(వీడియో)

 IPL 2021 : కావ్య దిగులును కేన్ సేన తీరుస్తారా..?రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్..(వీడియో)

 Jamieson-massage therapist Video: మసాజ్ మహిళపై జెమిసన్ మనసు పడ్డాడా..? పెద్దఎత్తున్న ట్రోల్ అవుతున్న ఈ ఫోటోపై మీమాటేంటి..?(వీడియో)